భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-76

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పులు చేసి పుణ్యక్షేత్రాలు తిరగనవసరంలేదు. అప్పులు చేసి దానాలు చేయనక్కర్లేదు. ఏది మనం త్యాగమో దానమో చేయగలిగి ఉంటే దాన్ని చేస్తే చాలు అని చెప్పారు. అతడు ఒక్కసారిగా ఈ మాటలు విని అవాక్కు అయినట్లుగా నిలబడ్డాడు. కనుల నిండా నీరు కారిపోతుండగా వచ్చి బాబా పాదాలపై పడ్డాడు.
బాబా అతని వీపు నిమురుతూ నాయనా, నీవు ఏది చేసినా దానివల్ల బాధ పొందకూడదు కదా. నిరంతరమూ చేసిన అప్పు ఎలా తీర్చాలో ఆలోచిస్తావు కాని నా దగ్గరకు వచ్చి స్వీట్లు పంచానన్న సంతోషం ఎపుడు అనుభవిస్తావు నీవు అన్నారు.
అతడు నేను చేసింది తప్పే బాబా, ఇక అంతా నీదే భారం అని అన్నాడు.
మళ్లీ మహిల్సాపతిని పిలిచి ఇతనికి 100 రూపాయలు ఇచ్చి పంపండి. ఇతను అప్పులు తీర్చుకుంటాడు అని చెప్పాడు. మహిల్సాపతి సరేనన్నాడు.
నా దగ్గరకు వచ్చినవారు దుఃఖాన్ని పొందరు అని నేనంటే అప్పులు చేసి వస్తే గాదు. నా దగ్గరకు అంటే నన్ను మనసున నిలుపుకున్నా నా దగ్గరకు వచ్చినట్లే కదా. నేను చెప్పే మాటల్లో అంతరార్థాన్ని అర్థం చేసుకొని మసలండి అన్నారు.
ఇలా బాబా ఎన్నో మంచి మాటలు చెప్పి వచ్చినవారిలో పరివర్తన తీసుకొని వచ్చేవారు.
ఇలాంటిదే మరొక సంఘటన-
సాయి బాబా దగ్గరకు ఒకవ్యాపారి వచ్చాడు. తన గురించి పరిచయం చేసుకొంటూ ‘బాబా నేను పెద్దవ్యాపారి ని అని పేరు తెచ్చుకున్నాను. చాలా సంవత్సరాల నుంచి నేను బాగానే వ్యాపారం చేస్తూనే ఉన్నాను. లాభాలు వచ్చేవి. కాని ఈ మధ్య ఎందుకో ఏది చేసినా నష్టమే వస్తోంది. వ్యాపారంలో చాలా నష్టపోయాను. అందుకే భారమంతా మీ మీద వేసి మీ దగ్గరకు వచ్చాను. నన్ను నష్టాల ఊబిలోంచి పైకి తీయండి. నాకు మనశ్శాంతిని కలిగించండి ’ అని వేడుకున్నాడు.
బాబా చిరునవ్వు నవ్వారు. అతడిని గురుచరిత్ర చదవమని చెప్పారు. అతడు నా మనసు వ్యాపారం రెండూ కుదుట పడేవరకు నేను ఇక్కడే ఉంటాను అనుకొన్నాడు. వారం రోజుల్లో గురుచరిత్ర చదవుదమని మొదలు పెట్టాడు. సప్తాహం చేశాడు. తన దగ్గర ఉన్నదానిలోనే కొద్ది మొత్తం వెచ్చించి దూద్‌పేడా తెచ్చి అందరికీ ఇచ్చాడు. అతడికి ఒకనాడు ఓ కల వచ్చింది.
అందులో అతనికి బాబా గురుచరిత్రను ఇచ్చినట్లు ఆ గురుచరిత్రను పట్టుకొని ఏదో చెబుతున్నట్టు వచ్చింది. అతడికి ఏమీ అర్థం కాలేదు. అందుకే ఈ సంగతి అక్కడే ఉన్న మహిల్సాపతితో చెప్పాడు.
అతడు బాబా నిన్ను ఇంకో వారం సప్తాహం చేయమని చెబుతున్నట్లు ఉంది. ఏంఫర్లావేదు. భగవంతుడే అన్నీ చూస్తాడు. కనుక నీవు గురుచరిత్ర మరలా మొదలు పెట్టు అన్నాడు.
అక్కడే కూర్చుని ఉన్న బాబా వైపు తిరిగి సాఠే నమస్కరించాడు.
సాఠే మనసులో బాబా అన్నింటికీ నీవే దిక్కు అని నమస్కరించి సప్తాహం ప్రారంభించాడు.
అక్కడే కూర్చుని ఇదంతా చూస్తూ హేమాదిపంతు బాబాను దగ్గరగా జరిగి ‘బాబా ఇదేమి అన్యాయం. నేను నలబై ఏళ్లుగా గురుచరిత్రను చదువుతున్నాను కదా. మరి నాకెపుడూ స్వప్న దర్శనం ఇవ్వలేదు. ఇతనేమో వారం రోజులు గురుచరిత్రను చదవగానే నీవు స్వప్నదర్శనం ఇచ్చావని చెప్పుతున్నాడో దీనిలో అర్థం ఏమిటి ’ అని అడిగాడు.
దానికీ చిరునవ్వే సమాధానంగా ఇచ్చారు బాబా.
కొద్దిసేపు తర్వాత ‘హేమా నీవు శ్యామా దగ్గరకు వెళ్లి 15 రూపాయలు నేను అడిగానని తీసుకొని రా’ అని చెప్పారు .
హేమాదిపంతు అలాగే వెళ్తానని శ్యామా దగ్గరకు వెళ్లాడు. అతడు వెళ్లేసరికి శ్యామా పూజలో ఉన్నాడు. హేమాదిపంతు అక్కడ కూర్చునే సరికి పక్కనే గురుచరిత్ర కనిపించింది. దాన్ని చూచి అరే నేనీ రోజు గురుచరిత్ర పారాయణ చేయలేదు అనుకొన్నాడు. వెంటనే దాన్ని తెరుస్తూ శ్యామా వచ్చేలోపు ఈ గురుచరిత్రనుచదువుతాను అనుకొని పుస్తకాన్ని తీయగానే హేమాదిపంతు చదవాల్సిన పుటనే వచ్చింది. అతడు వెంటనే ఆరోజు చేయాల్సిన పారాయణ పూర్తి చేసాడు.
అది పూర్తవగానే శ్యామా వచ్చాడు.
బాబా అడగమన్న డబ్బు గురించి హేమాదిపంతు చెప్పాడు.
శ్యామా దానిని విని నా దగ్గర డబ్బు ల్లేవని బాబాకు తెలుసు అయినా నిన్ను పంపించడంలో ఏదో అర్థమున్నట్టు ఉంది. బాబాకు 15 రూపాయలకు బదులుగా నేను పదిహేను సార్లు నమస్కారాలు చేస్తాను అంటూ నమస్కారాలు చేశాడు. ఆ తరువాత నా మనసులో ఒక విషయం నీకు చెప్పాలని అనిపిస్తోంది. దాన్ని నీకు వివరిస్తాను కాసేపు కూర్చో అని చెప్పాడు.శ్యామా తన మనసుకు తట్టిన విషయం చెప్పడం ఆరంభించాడు. ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743