భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-77

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజమైన గురువు ఎవరో తెలుసుకోగలగాలి. గురువును ఆశ్రయించిన వారికి ఎట్టి కష్టాలుండవు. గురువును ఆశ్రయించడం అంటే గురువు ఏది చెప్పితే దానే్న సందేహం లేకుండా ఆచరించగలగాలి. నీకు తెలుసు కదా పద్మపాదుని సంగతి. ఆదిశంకరాచార్యులు నదికి ఆవలి ఒడ్డున ఉండి తన శిష్యుడిని ఇలా త్వరగా రా అని పిలవగానే అతడు అది నది అని గాని ఎల వెళ్లడం అని కాని ఆలోచించలేదు. అలాగే నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అపుడు గురువే శిష్యునికి ఎలాంటి కష్టం కలుగకుండా అతని పాదాల అడుగున పద్మాలనుంచాడు. ఆ శిష్యునికే కాలాంతరంలో పద్మపాదుడన్న బిరుదు వచ్చింది కదా. అట్లానే సద్గురువు దొరకడం దుర్లభం. దొరికిన సద్గురువును గట్టిగా నమ్మి ఈ జన్మనుపునీతం చేసుకోవాలి. విశ్వామిత్రుడు సైతం కష్టపడి తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. శ్రీరాముడు గురువుచెప్పిన మార్గంలో నడిచి ధర్మమూర్తిగా పేరుతెచ్చుకున్నాడు. ఎందరో గొప్పవారు అయ్యారు అంటే గురు అనుగ్రహం వల్లనే అని తెలుసుకోవాలి. ఇలా శ్యామా చెప్పగానే
‘‘నిజమే. ఎవరి కర్మానుసారం వారికి ఫలాలు భగవంతుడే ఇస్తాడు. పరులను చూచి వారి కున్నదినాకు లేదనుకోవడం మంచిది కాదు ఇది చెప్పడానికే బాబా నీ దగ్గరకు నన్ను పంపించాడు. నేను ఇక ఇప్పట్నుంచి బాబానే సంపూర్ణంగా నమ్ముతాను. అపుడు అన్నీ ఆయనే చూసుకొంటారు. ’ అని హేమాదిపంతు చెప్పారు.
అంతలో వారికి గుడిలో గంటలు వినిపించాయి. మధ్యాహ్న హారతి సమయం కావొచ్చింది. పదండి బాబా ను దర్శనం చేసుకొని వద్దాం అన్నారు.
వీరిద్దరూ కలసి బాబా దగ్గరకు వెళ్లారు.
అక్కడ బాపూసాహెబ్ జోగ్ కూర్చుని ఉన్నారు. వీరిని చూచి బాబా ఆనందంతో రండి రండి మీకోసం ఈ జోగ్ చూస్తున్నారు అన్నారు.
‘బాబా నామనసులో మాటలు అన్నీ చెప్పేస్తారు కాని నేను కూడా బాబాఅంతటి వాడ్ని కావాలనుకొంటే చేయరేమి నేను అడిగేది తప్పా’ జోగ్ మనసులో అనుకొన్నాడు.
‘జోగ్ ఇంతకుముందు గురువు అనుగ్రహం ఉంటే చాలు అనుకొనేవాడివి కాని ఇపుడు గురువే నేను కావాలి అనుకొంటున్నావు. కాని గురువు అంటే దేన్నీ ఆపేక్షించరన్న సంగతి నీకు తెలియడం లేదు. ఏ కాలానికి ఏది కావాలో దాన్ని భగవంతుడే మనచేత చేయిస్తాడు. నీవు కోరుకున్నా లేకపోయినా జరిగేదే నీకు ఇవ్వాలనుకొన్నది భగవంతుడు ఇవ్వనే ఇస్తాడు ’అన్నాడు.
జోగ్ ‘‘బాబా నన్ను క్షమించు ఏదో కోరికతో అలా అనుకొన్నాను. నీవు నా హృదయపీఠం పై వసించు చాలు. నన్ను ధర్మమార్గంలో నడిపించు ఎల్లవేళలా నన్ను నీ నీడలో ఉండేట్టుగా ఆశీర్వదించు’’ అని వేడుకున్నాడు.
శ్యామా, హేమాదిపంతు ఇద్దరూ ‘‘బాబా మీ లీలలను అర్థం చేసుకొనే శక్తిని మాకివ్వు’’అని నమస్కరించారు.
***
నానా చందోర్కర్ బాబాను సేవిస్తుండేవాడు. అతడు అన్ని ధర్మశాస్త్రాలను పఠిస్తుండేవాడు. ఎపుడైన అనుమానం వచ్చిన చోట పండితులను బాబాను అడిగి తెలుసుకొంటూ ఉండేవాడు. ఒకసారి అతడు బాబా దగ్గర వచ్చి కూర్చుని భగవద్గీతను చదవడం ప్రారంభించాడు.
అందులో నాల్గవ అధ్యాయంలోని 34 శ్లోకం
తద్విది ప్రతిపాతే న పరిప్రశే్న న సేవయా
ఉపదేక్ష్యన్తితే . జ్ఞానం జ్ఞాని నస్తత్వదర్శినః అని చదివాడు.
వెంటనే బాబా చందోర్కర్ ఈ శ్లోకానికి కాస్త వివరణ చెప్తావా అని అడిగారు. అతడు అర్థం చెప్పాడు.
ఈ శ్లోకంలో పరిప్రశ్న అని అడగడంలోని ఔచిత్యమేమన్నా నీకు తెలుసా అని అడిగాడు.
దానికి వారు బాబానే వివరణ ఇవ్వమని అడిగారు. కేవలం గురువుకు నమస్కారం చేస్తే చాలదు. అతడిని పరిపూర్ణంగా నమ్మాలి. ఆత్మసమర్పణ చేసుకోవాలి. అది ప్రణిపాతమంటే. బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే సేవ చేయడం కాదు. తన శరీరం కేవలం గురు సేవకోసమే ఉన్నదని అనుకోవాలి. దానిపై తనకెట్టి అధికారం లేదనుకోవాలి. అట్లాంటే కేవలం గురుసేవ చేయడమే తన కర్తవ్యమని ఎవరు భావిస్తారో వారే నిజమైన శిష్యులు.
శ్రద్ధ గలవారికే బోధించాలి అన్నది సూక్తి. గురువును వినమ్ర భావంతో అడగాలి. సమయ సందర్భం చూసుకొని అడగాలి. శ్రద్ద్భాక్తులున్నవారికే విద్య వస్తుంది. ఆకలి రుచి ఎరుగనట్లు నిద్ర సుఖమెరుగనట్లుగా జ్ఞానార్జనకు విద్యపట్ల శ్రద్ధ కావాలి. ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తితోనే గురువు పట్ల వినయభావం ఉండాలి. ఆయన అడిగితే కాకుండా ఆయనకు ఏమి కావాలో చూసి సేవ చేస్తూ అపుడు గురువును అడిగి సందేహ నివృత్తి చేసుకోవాలి. కేవలం గురువీక్షణ ద్వారా కూడా విద్యను అభ్యసించవచ్చు. గురువు అనుగ్రహం ఉంటే చాలు సర్వ విద్యలూ కరతలామలకం అవుతాయి.
ఇలా ఎంతోసేపు ప్రతిపాతం అంటే ఏమిటో బాబా వివరించారు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743