భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-80

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోపతాపాలన్నింటికీ కారణం ఒక్క మమకారమే. మనుష్యులు ఇది నాది అది నీది అని తారతమ్యభేదాలు కల్పించుకుంటుంటారు. దానివల్ల వారికి కోపం వస్తుంది. కోపం వల్ల బాధ కలుగుతుంది. ఆ బాధతో అనేక వ్యసనాలు దరిచేరుతాయి అన్నారు బాబా.
బాబా ఎపుడు ఎందుకు ఏమి చెబుతారో అప్పటికప్పుడు తెలీక పోవచ్చు. కాని రాబోయే కాలంలో వారికి బాబా చెప్పిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది.
బాబా దగ్గరకు ఒక మార్వాడీ సేటు వచ్చాడు. అతడు ఎంతో దిగాలు కూర్చున్నాడు. ‘ఏం మార్వాడీ సేటు నా దగ్గరకు వచ్చినా కూడా ఇంకా నీకు దిగులు పోవడం లేదా? ఒక దగ్గర నష్టం వస్తే మరోదగ్గర లాభం వస్తుంది. దానికి ఎందుకు బాధ’ అన్నీ నావి నావి అనుకొంటూ ఉంటే బాధ కలుగుతుంది. ఈశ్వరార్పణం అని పనిచేయి అపుడు లాభం వచ్చినా నష్టం వచ్చినా పెద్ద బాధ ఏమీ ఉండదు ’ అన్నారు.
మార్వాడీ ‘బాబా’’ అని కన్నీళ్లు పెట్టుకొన్నాడు.
బాబా చిరునవ్వుతో చూస్తున్నాడు.
అంతలో ‘‘నాన్నా మీకు టెలిగ్రామ్ వచ్చింది’’ అంటూ ఓ చిన్న పిల్లవాడు వచ్చాడు.
‘‘ఏంటో అది’’ అని కంగారు గా మార్వాడీ అక్కడి నుంచి కదిలాడు.
‘సేటు గాబరా పడకు అంతా శుభమే జరుగుతుంది. ’అన్నారు బాబా
సేటు వచ్చిన టెలిగ్రామ్ ను చదివి నిజంగా ఇది నిజమేనా బాబా నన్ను కరుణించావా అని అంటూ బాబాకు నమస్కరించాడు.
అక్కడ జరుగుతున్నది ఏమిటో అర్థంకాక అందరూ వారిద్దరినే చూస్తున్నారు.
‘శ్యామా! ఏమీ లేదయ్యా ఈ మార్వాడీ సేటు తన గడ్డివాము తగులబడిపోయిందని ఒకటే దిగాలుగా కూర్చున్నాడు. కాని ఇపుడు ఇతడు పంపిన సరుకు బాగా అమ్ముడైందని ఇంకో సేటు అనుకొన్న దానికి రెట్టింపు ధరను నీకు పంపుతాను అని సమాచారాన్ని ఇచ్చాడు. దాన్ని చూసుకొని సంతోష పడిపోతున్నాడు’అన్నారు బాబా.
‘అవును బాబా చెప్పేది నిజం. నాకు గడ్టివాము వల్ల 100 రూపాయలు నష్టం వస్తే ఈ అమ్మకం వల్ల నాకు 1000 రూపాయల లాభం వచ్చింది. నా కష్టం తీరినట్లే అనుకొన్నాను’అని మార్వాడీ సేటు చెప్పారు.
శ్యామా ‘బాబా మీరు ఇక్కడే కదా కూర్చుని ఉన్నారు. మరి ఈ మార్వాడీ సేటు బొంబాయి నుంచి వచ్చాడని ఇతని గడ్డివాము తగులబడిందని నీకు ఎలా తెలుసు ’అని అడిగాడు.
బాబా చిరునవ్వు నవ్వి సుఖదుఃఖాలు క్షణికాలే. సుఖమైనా దుఃఖమైనా ఎక్కువ కాలం ఎవరి దగ్గరా ఉండవు. క ష్టం వచ్చినపుడు ఎవరైనా అన్నీ నాకు కష్టాలే ఉన్నాయి. అందరూ సుఖపడుతున్నారు. నాకు మాత్రమే కష్టాలు అని అనుకొంటారు. అదేసుఖం వచ్చినపుడు నాకు సంతోషం కలిగిందని ఎవరూ ఎవరితోను చెప్పుకోరు. పైగా సంతోషంగా ఉన్నానని ఎవరూ మనఃస్ఫూర్తిగా అనుకోరు. దుఃఖం రాగానే మాత్రం తెలిసిన దేవుని పేర్లన్నీ చదివేస్తుంటారు. వారు మా కోరికలు తీర్చాలని ఒకవేళ ఈ కోరిక తీరితే ఈ మొక్కు తీరుస్తామని కూడా అనుకొంటారు.
మొక్కులు మొక్కుకోవడం మంచిదే కాని తప్పులు చేసినపుడు అవి తప్పులు అని తెలిసిన తర్వాత ఆ తప్పులను మరలా చేయకుండా ఉండాలి కదా. మరి దాని గురించి ఎందుకు చేయరు? అన్నారు బాబా.
అందరూ వౌనంగా బాబా చెప్పింది విని ఎవరికి వారు ఆలోచిస్తూ ఉండిపోయారు.
మరొకరోజు నానా సాయి దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలోనే ముస్లిం స్ర్తిలు ఇద్దరూ లోపలికి రాబోతుండడం నానా చూసి వారిని చూడకూడదుకదా అని బయటకు వెళ్లబోయాడు. బాబా నానాను వారించి మరలా తన దగ్గరే కూర్చోబెట్టుకున్నాడు. అంతలో ఆ స్ర్తిలు వచ్చి బాబాకు నమస్కారం చేసి వెళ్లిపోయారు. కాని వారు వెళ్లిన తరువాత బాబా ‘‘నానా మనకు కళ్లు ఉన్నది చూడడానికే ప్రకృతిలోని అందాలన్నింటిని చూసి ఆహా! భగవంతుని సృష్టి ఎంత బాగుందో అనుకోవాలి కాని ఆ అందం నా సొంతం అయితే అన్నట్లు ఆలోచించకూడదు. ’’ -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743