భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబాకు కోపం ఎక్కువసేపు ఉండదు. ఆయన కోపం తగ్గగానే మీరు మళ్లీ వద్దురు కాని అని ఆ వచ్చినతనితో చెప్పారు. ఆయన సరే అని వాళ్లు చెప్పినట్లే చేశాడు.
కాని రెండో రోజు బాబా దర్శనం కోసం మసీదుకు ఆయన వచ్చాడు. ఆయన మసీదు దరిదాపుల్లోకి రాగానే బాబా లోపలనుంచి కేకలు వేస్తూ ఈ మూర్ఖుణ్ణి లోపలకు రానివ్వద్దు. మంత్రాలు, తంత్రాలు నా దగ్గర పనిచేయవు. వెళ్లిపొమ్మని చెప్పండి. రానే రావద్దు అని గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు.
ఆయనకు ఏమి చేయాలో పాలుపోక మహిల్సాపతిని వేడుకున్నాడు. బాబాతో ఎలాగైనా నాకు మాట్లాడే అవకాశం ఇప్పించండి. నా పేరు ఇమాంబాయి. నేను ఎన్నో కష్టాల్లో వున్నాను అని చెప్పాడు.
సరే ముము ముందు బాబాను అనుమతి అడిగి నీకు చెప్తాము. నీవు ఇక్కడే ఉండు అని చెప్పి ఎప్పటిలాగే మహిల్సాపతి బాబా దగ్గరకు వెళ్లాడు.
బాబా మహిల్సాపతిని చూడగానే ‘చూశావా కాకాసాహెబ్, ఈ మహిల్సాపతి ఎవరి మెప్పుకోసమో వారి తరఫున మాట్లాడడానికి వస్తున్నాడు. ఇతను ఎవరితో మాట్లాడమని సిఫారసు చేస్తే నేను వారితో మాట్లాడాలని ఎక్కడైనా ఉందా? అతడు వచ్చినవాడు ఎవరు ఏమి చేశాడు? అసలు నాకు కోపం ఎందుకు వచ్చింది అని ఏమన్నా విచారించాడా?
చేతిలో శక్తి ఉంది కదా అని అధికారం ఉంది కదా అని ఉపాధ్యాయులను కూడా విచక్షణ లేకుండా కొట్టేస్తే నేను ఊరుకుంటానా? ఊరుకోవాలా? నేను నోరుమూసుకుని ఉండమని ఈ మహిల్సాపతి నాకు చెప్తాడా?’ అని అన్నాడు.
కాకాసాహెబ్ ఈ మహిల్సాపతి ఎవరి గురించి అయినా చెప్తాడా అని ఎదురుచూశాడు.
అనుకొన్నట్టుగానే మహిల్సాపతి రాగానే బాబాకు నమస్కారం చేశాడు.
బాబా వెంటనే ‘ఇది నీ నమస్కారమా? లేక ఎవరిదైనా మోసుకొచ్చావా’ అని అన్నారు.
‘బాబా నీవు అందరినీ ఒకటిగా చూస్తావు కదా. మరి ఎందుకంత కోపం? అతను కూడా నీ బిడ్డడే కదా’ అన్నాడు.
‘నిజమే. కాని నా బిడ్డడని తప్పు చేస్తే ఊరుకొంటానా? శిక్షించాల్సిన అవసరం ఏమీ లేదా? మీ చేత కొట్టించుకున్నది, తిట్టించుకున్నది నా బిడ్డడే కదా. మరి నేను ఆ బిడ్డడని చూసే బాధ్యత నేను మోయకూడదా’ అని అన్నాడు.
అపుడే వచ్చి అక్కడ నిల్చున్న ఇమాంబాయి బాబా కాళ్లమీద పడి ‘బాబా నన్ను క్షమించు. నేను మహాపరాధం చేశాను. ఘోరమైన తప్పు చేశాను. నేను ఆలోచించకుండా చేసిన తప్పిదం ఇది. నన్ను రక్షించే భారం నీది’ అంటూ పరిపరివిధాలుగా పరితపించసాగాడు.
నేను చాలా మన్నించలేని తప్పు చేశాను. నన్ను నీవే కాపాడాలి అని మళ్లీ వేడుకున్నాడు ఇమాంబాయి.
కాకాసాహెబ్‌కు అసలు ఏమీ అర్థం కాలేదు.
అపుడు ఇమాంబాయి నేను పోలీసు ఆఫీసరుగా ఉద్యోగం చేస్తున్నాను కదా. నా ఉద్యోగ రీత్యా నేను ఒక కేసు పరిశోధనలో ఉపాధ్యాయుణ్ణి కొట్టాను. అది నా తప్పు. నాకు కొట్టే అధికారం లేదు కాని నా బుద్ధి వక్రమార్గం పట్టి నేను అనవసరంగా ఆ ఉపాధ్యాయుణ్ణి అవస్థ పెట్టాను. అందుకే అప్పట్నుంచి ఈ దురవస్థ పొందాను. ఇపుడు నా ఉద్యోగానికే ముప్పు వచ్చేట్టు ఉంది అని చెప్పి నీవు నన్ను కాపాడాలి అంటూ బాబా కాళ్లు పట్టుకొన్నాడు.
‘బాబా తెలియక తప్పు చేశాను. ఇపుడు నా ఉద్యోగమే పోతుంది. నువ్వే నన్ను కాపాడాలి. నా తప్పును క్షమించు బాబా. నేను ఎప్పుడూ తప్పు చేయను. నీవే నన్ను తప్పు చేయకుండా కాపాడు’ అని అన్నాడు ఇమాంబాయి.
‘‘బాబా మేమందరం నీ బిడ్డలమే కదా. నీవే మమ్ముల్ని కాపాడాలి. అంతేకాని నీవే కోపం తెచ్చుకుంటే మేం ఏం చేయగలం? మా తప్పులను నీవే క్షమించాలి. బాబా నీవు ఇతనిని కాపాడు. నువ్వే దిక్కు అని వచ్చాడు కదా’ అన్నాడు మహిల్సాపతి.
‘అవును బాబా. అన్యథా శరణం నాస్తి. నాకు నీవు తప్ప మరో దిక్కు లేదు’ ఇమాంబాయి కన్నీటితో వేడుకున్నాడు.
‘‘ఊ.. ఏం చేయగలను. అందరిలోనూ నేను ఉంటానని ఎప్పటికి తెలుసుకొంటారు. ఎవరిని తిట్టినా నన్ను తిట్టినట్టే కదా. ఎవరిని కొట్టినా నన్ను కొట్టినట్లే కదా. మీకు ఏదైనా కష్టం వస్తే నన్ను తలుచుకండి. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743