భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ కష్టాన్ని నేను తీరుస్తాను. అంతేకాని మీరెందుకు చేయి చేసుకొంటారు. సరే ఫో.. ఇకనైనా బుద్ధిగలిగి ఉండు’’ శాంతంగా బాబా అన్నారు.
ఇమాంబాయి మరలా మరలా నమస్కారం చేసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.
చూశారా! ఇదంతా బాబా ఆశీర్వాదం. తప్పు చేసినా పశ్చాత్తాపం పొందితే వారిని కాపాడే బాధ్యత బాబానే తీసుకొంటారు.
ఒక రోజు పొద్దునే హేమదిపంతు బాబా దర్శనార్థం వచ్చాడు.
‘హేమా! ఆ ఇమాంబాయి ఏమిటి, అతనికిష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తానంటున్నాడు. ఇపుడు కనుక వెళ్లాడంటే ఉరుములు మెరుపులు వస్తాయి. రేపు వెళ్లవచ్చు కదా’ అన్నాడు బాబా.
‘‘బాబా ఇంత క్రితమే అతడు బయలుదేరి వెళ్లాడు. అతని ఉద్యోగ సమస్య తీరిపోయింది. వారే మళ్లీ త్వరగా రమ్మని కబురు పంపించారని ఇపుడు బయలుదేరి వెళ్లాడు. అతడిని మీరే కాపాడాలి బాబా’’ అన్నాడు హేమదిపంతు.
‘బాగుంది. నేను చెప్పినట్టు వినరు కాని నేనే కాపాడాలని మళ్లీ నీ సిఫారసు ఒకటి’ బాబా నవ్వాడు.
హేమాదిపంతు బాబాకు నమస్కరించి వెళ్లాడు.
ఇమాంబాయి దారిలో ఉండగానే పెద్దగా ఉరుములు మెరుపులతో గాలివాన ప్రారంభమైంది. ఇదేమిటి నేను బయలుదేరేటపుడు ప్రశాంత వాతావరణమే ఉంది. మధ్యలో ఇలా ఉంది. అమ్మో నేను సురళానదిని కూడా దాటాలి సుమా అని అనుకొన్నాడు.
అయినా నేను బాబా స్మరణ చేసుకొంటూ వెళతాను. ఏదైనా కష్టం వస్తే ఆయనే చూసుకొంటాడు అనుకుంటూ ముందుకు బయలుదేరాడు. మనసు మాత్రం బాబాపైనే్న లగ్నం చేశాడు.
ఉన్నట్టుండి పెద్దగా శబ్దం వచ్చింది. ఎదురుగా మఱ్ఱిచెట్టుపై పిడుగు పడి కాలిపోయింది. అమ్మో.. అనుకొన్నాడు ఇమాంబాయి.
మరికొద్దిదూరం నడవగానే సురళానది వేగంగా మనిషి లోతు ఉన్నట్టుగా ప్రవహిస్తోంది.
దాన్నిచూసి ‘అమ్మో నేను ఈ నదిని ఎలా దాటగలను. ఇపుడు అనవసరంగా బయలుదేరాను. బాబా నీవే నన్ను ఈ నదిని దాటించు’ మనసున అనుకొన్నాడు.
ఎక్కడనుంచో ఓ యువకుడు రెండు కుక్కలను పట్టుకొని ఆ దారిన వెళుతున్నాడు.
‘బాబూ నీవు ఎక్కడికి వెళుతున్నావు’ అడిగాడు ఇమాంబాయి.
‘ఇదిగో ఈ నదిని దాటి వెళ్లాలని వచ్చాను. ఏమి మీరు కూడా నాతో వస్తారా’ అన్నాడు ఆ పిల్లవాడు.
‘కాని ఈ నది ఇలా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది కదా. ఎలా ఈ నదిని దాటటం అని నేను మా గురువుగారిని ప్రార్థిస్తున్నాను’ అన్నాడు ఇమాంబాయి.
‘మా గురువుగారే నన్ను, మిమ్మల్ని కూడా నది దాటిస్తాడులే రండి నాతో’ అని ఇమాంబాయి చేయి పట్టుకొని ముందుకు దారితీశాడు.
నాలుగు అడుగులు వేసేసరికి అక్కడ సురళానది మోకాలి లోతు ప్రవహిస్తూ కనిపించింది.
‘ఇదిగో ఇక్కడ చూడండి నీళ్ల వేగం తక్కువగా ఉంది, రండి’ అంటూ ఆ అబ్బాయి చేతిని పట్టుకుని ఆ నీళ్ళల్లో నడుస్తూ ముందుకు వెళ్ళాడు. నది దాటేసరికి ఆ పిల్లవాడు కనిపించలేదు. ఇదేంటి ఇప్పటిదాకా నా చేయి పట్టుకుని వచ్చిన పిల్లలాడు ఏడి అనుకుంటూ చుట్టుప్రక్కల వెతికాడు ఇమాంబాయి.
వెనక్కు తిరిగి చూసేసరికి సురళా నది ఇందాకటిలాగే వేగంగా మనిషి లోతున ప్రవహిస్తోంది. ఇదేంటి ఇపుడు ఇక్కడనుంచే కదా మేము వచ్చింది. మోకాలి లోతు నీళ్లే కదా ఉండింది అని మళ్లీ చూశాడు. సురళానదిలో ఏ మాత్రం మార్పు లేదు. ఈ పిల్లవాడు అనుకొంటూ అటు చూసేసరికి దూరంగా శిరిడీ సాయిబాబా కుక్కలను పట్టుకుని వెళుతూ కనిపించాడు.
‘బాబా!’ పెద్దగా పిలిచాడు ఇమాంబాయి.
‘శుభమస్తు వెళ్లిరా’ అన్న శబ్దం ఇమాంబాయికి వినిపించింది.
దీనినంతా వెంటనే హేమాదిపంతుకు తెలియజేయాలి. బాబా ఇక్కడికి ఎందుకొచ్చారో తెలుసుకోవాలి అనుకొని ముందుకు కదిలాడు. తర్వాత తన నౌకరుతో జరిగిన విషయాలన్నింటిని కాగితంపైన రాసి హేమాదిపంతుకు పంపించాడు.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743