త్రివిక్రమ్ సినిమాలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘అ..ఆ’ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జోరుగా జరుపుకుంటోంది. యువ హీరో నితిన్, క్రేజీ భామ సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ రూపొందించే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ప్రముఖ తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా రూపొందే ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ గ్లామర్ భామ దీపికా పదుకొనె నటిస్తోందని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రంలో దీపికను నటింపజేయాలని ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. త్రివిక్రమ్ మార్క్ స్టైల్లో రూపొందే ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం వుంది.