క్రీడాభూమి

టి-20 వరల్డ్ కప్ - నేటి నుంచి ట్రోఫీ టూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 12: వచ్చే ఏడాది మార్చి 11 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు మన దేశంలో జరిగే టి-20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీ ప్రపంచ యాత్ర ఆదివారం ప్రారంభమవుతుంది. ఈ ట్రోఫీని ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరిగే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రదర్శనకు ఉంచుతామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అదే విధంగా ఎంపిక చేసిన నగరాల్లోనూ అభిమానుల సందర్శనార్థం ట్రోఫీని ఉంచనున్నట్టు పేర్కొంది. ఈ ట్రోఫీని నిస్సాన్ కంపెనీ తయారు చేసిందని ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ తన ప్రకటనలో తెలిపాడు. ట్రోఫీ టూర్ విజయవంతమవుతుందని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. అదే విధంగా క్రికెట్‌కు ఆదరణ మరింత పెరుగుతుందని పేర్కొన్నాడు.