రాష్ట్రీయం

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభజన చట్టంలోని హామీలను అమలు చేయరా? : నిలదీసిన తెరాస

హైదరాబాద్, నవంబర్ 22:విభజన చట్టంలోని హామీలను సైతం అమలు చేయకుండా కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని, బిజెపి పాలిత రాష్ట్రాల పట్ల ఒక రకంగా,బిజెపియేతర రాష్ట్రాల పట్ల మరో రకంగా వ్యవహిరిస్తోందని టిఆర్‌ఎస్ ఎంపి కవిత నిలదీశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడిన కవిత ప్రధానంగా 16 అంశాలను ప్రస్తావించారు. విభజన చట్టంలోని హామీల అమలు గురించి అనేక సార్లు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు. హైకోర్టును విభజించాలని న్యాయవాదులు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నా కేంద్రం నుంచి స్పందన లేదని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ రాష్ట్రానికి వచ్చి నప్పుడు కోర్టును విభజిస్తామని చెప్పారని కానీ ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదని అన్నారు. తెలంగాణకు స్పెషల్ స్టేటస్ గురించి ముఖ్యమంత్రి అనేక సార్లు కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడంలో కేంద్రం ఎందుకు వౌనంగా ఉందని ప్రశ్నించారు. దీని కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వంపైన బాధ్యత ఉందని, అలానే బిజెపిపై కూడా ఉందని అన్నారు. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు తెలంగాణకు ప్రోత్సహకాలు ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రాల్లో ఇచ్చిన ప్రోత్సాహకాలు తెలంగాణలో ఇవ్వాలని కోరారు. ఎన్‌టిపిసికి కోల్ లింకేజికి ఏడాదిన్నర కాలం పట్టిందని ఇది కేంద్ర వైఖరి తెలుపుతోందని అన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీని సెంట్రల్ వర్సిటీ చేయాలని కోరితే కేంద్రం మాత్రం కొన్ని నిధులు ఇస్తాం నిర్వాహణ మీరే చూసుకోవాలని చెబుతుందని తెలిపారు. ఆంధ్రకు మాత్రం ఐఐఎప్, ఎయిమ్స్ ఇచ్చారు, బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఈ విషయం తెలియదా? అని ప్రశ్నించారు. ఉద్యోగు విభజన ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి అని అన్నారు. 13వ ఫైనాన్స్ కమిషన్ నిధులు 1200 పెండింగ్‌లో ఉన్నాయని, అలానే సిఎస్‌టి కంపనె్షషన్ ఆరువందల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పేదల ఇళ్ల పథకంలోనూ వివక్ష కనిపిస్తోందని, తెలంగాణ 179 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపితే 159 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, ఆంధ్ర 250 కోట్ల ప్రతిపాదనలు పంపితే 2500 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. ఇప్పటి వరకు కెసిఆర్ మూడుసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారని, పలుమార్లు మంత్రులను కలిశారని, ఎంపిల బృందం కలుస్తూనే ఉందని కానీ కేంద్రం తెలంగాణను చిన్నచూపు చూస్తోందని అన్నారు. తెలంగాణకు ఎయిమ్స్ కావాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయనుతో పాటు ఢిల్లీ వెళ్లి కిషన్‌రెడ్డి ప్రయత్నించాలని అన్నారు. బయ్యారం స్టీల్ ఫ్లాంట్ నిర్మాణం హామీ విభజన చట్టంలోనే ఉందని, మొత్తం కేంద్రం నిధులతో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసే విధంగా కేంద్రంపై రాష్ట్ర బిజెపి ఒత్తిడి తేవాలని అన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలను సైతం అమలు చేయడానికి బిజెపి ప్రభుత్వం ప్రయత్నించడం లేదని విమర్శించారు. కిషన్‌రెడ్డి మాత్రం కేంద్రాన్ని ప్రశ్నించడానికి బదులు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. ఆంధ్రకు కేంద్రం ఎన్ని చేసుకున్నా అభ్యంతరం లేదు, కానీ తెలంగాణ పట్ల వివక్ష చూపడం సరికాదని అన్నారు. విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు విజయారెడ్డి, శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.