రాష్ట్రీయం

మండలి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ బోణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్సాహంలో పార్టీ శ్రేణులు

హైదరాబాద్, డిసెంబర్ 10: శాసన మండలి ఎన్నికలు టిఆర్‌ఎస్ బోణితో మొదలయ్యాయి. వరంగల్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థి కొండా మురళి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం టిఆర్‌ఎస్ శ్రేణులకు కొత్త ఊపునిచ్చింది. వరంగల్‌లో విజయం సాధించినట్టుగానే మిగిలిన 11 స్థానాలనూ కూడా గెలుచుకుంటామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండలో మాజీ ఎంపి కోమటి రెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో పోటీ రసవత్తరంగా మారింది. గతంలో టిడిపిలో ఉన్న తేరా చిన్నపరెడ్డి టిఆర్‌ఎస్ అభ్యర్థిగా రంగంలో నిలిచారు. ఆర్థికంగా రెండు పార్టీల అభ్యర్థులు బలమైన వారే. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో ఉన్నప్పుడు రాజీనామా చేయగా, తేరా చిన్నపరెడ్డి అప్పుడు టిడిపిలో ఉన్నారు. ప్రచారంలో కాంగ్రెస్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోంది. ఉద్యమ సమయంలో కనీసం ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని నాయకుణ్ని టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీకి నిలిపారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శిస్తున్నారు. అయితే వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌కు కోమటిరెడ్డి అండగా నిలిచారని టిఆర్‌ఎస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఖమ్మంలో కూడా పోటీ అసక్తికరంగా మారింది. ఒక్క ఖమ్మం నియోజకవర్గం నుంచి మాత్రమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పోటీ చేస్తోంది. ఈ జిల్లాలో సాధారణ ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది. అనంతరం మారిన పరిస్థితుల్లో పలువురు టిఆర్‌ఎస్‌లో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖమ్మం నుంచి టిఆర్‌ఎస్ అసలు పోటీనే చేయలేదు. కానీ ఆ తరువాత జిల్లా పరిషత్తు చైర్మన్‌తో సహా పెద్ద సంఖ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టిఆర్‌ఎస్‌లో చేరారు. మండలి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సిపిఎం ఒక్క ఖమ్మంలో మాత్రం సిపిఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇక ఖమ్మంలో కాంగ్రెస్ పోటీ చేయడం లేదు, సిపిఐకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది.
రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో అధికార పక్షానికి గట్టి పోటీ ఎదురవుతోంది. అయితే మొత్తం పనె్నండు స్థానాల్లో విజయం సాధిస్తామని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు.