రాష్ట్రీయం

తెరాస సత్తాకు సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు మండలి పోరు
ఆరు స్థానాలకు పోలింగ్
ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం
30న లెక్కింపు: భన్వర్‌లాల్
హైదరాబాద్, డిసెంబర్ 26: నాలుగు జిల్లాల్లోని ఆరు శాసన మండలి స్థానాలకు ఆదివారం జరుగుతున్నాయి. పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని, ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికార్లు ప్రకటించారు. మరోపక్క రాజకీయ పక్షాలు సైతం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. క్యాంపులనుంచి ఓటర్లను ఇప్పటికే జిల్లాలకు తరలించారు. ఖమ్మంలో పోటీచేస్తున్న సిపిఐ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లు ఆంధ్రలో క్యాంపులు నిర్వహిస్తే, తెరాస రంగారెడ్డి జిల్లాలో క్యాంపు నిర్వహించింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మొత్తం 12 స్థానాల్లో ఆరు స్థానాలను తెరాస ఏకగ్రీవంగా ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. కరీంనగర్ (2), నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లో ఒక్కోస్థానానికి మండలి ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. రంగారెడ్డి (2), మహబూబ్‌నగర్ (2), నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఆదివారం పోలింగ్ జరుగుతుంది. అన్ని జిల్లాల్లోనూ ప్రధానంగా తెరాస, కాంగ్రెస్ మధ్య పోటీ కనిపిస్తోంది. తెదేపా, భాజపా నుంచి పోటీ నామమాత్రమే. ఖమ్మంలో సిపిఐ, సిపిఎం, తెదేపా, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా సిపిఐ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు బరిలో ఉన్నారు.
నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ఒకప్పుడు వామపక్షాలకు కంచుకోటలు. తరువాత ప్రాభవం తగ్గినా, కాంగ్రెస్, తెదేపాల్లో ఎవరు గెలవాలన్నా వీరి బలం ప్రధానం. క్రమంగా క్షీణిస్తూ తాము గెలించేంత బలం కోల్పోయినా ఎవరో ఒకరిని గెలిపించే స్థాయిలో ఉండిపోయారు. అయితే ఇప్పుడు ఆ రెండు జిల్లాల్లోనూ కాంగ్రెస్, తెదేపాలు కాకుండా తెరాస మండలి ఎన్నికల్లో సత్తా చూపేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. నల్లగొండ మండలి ఎన్నికలో వామపక్షాలు పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఇక ఖమ్మంలో సిపిఐ తరఫున పువ్వాడ నాగేశ్వరరావు పోటీ చేస్తుంటే, సిపిఎం మద్దతిస్తోంది. సిపిఐ ఎంఎల్ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించింది. జిల్లాలో ప్రధానపక్షాలైన కాంగ్రెస్, తెదేపాలు అసలు పోటీనే చేయడం లేదు. సిపిఐకి తెదేపా మద్దతు ప్రకటిస్తే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సొంతంగా పోటీ చేస్తోంది. తెరాస ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటే, సిపిఐ ఓట్లకు తెరాస గాలం వేసే ప్రయత్నాల్లో ఉంది. గెలుపుపై రెండు శిబిరాలు గాంభీర్యం చూపిస్తున్నా, ఎవరి భయాలు వారికున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు లేవుకనుక, ఆ బలాన్ని తమవైపు తిప్పుకోడానికి తెరాస ప్రయత్నిస్తోంది.
నల్లగొండలో వామపక్షాలకు ఉనికేలేకుండా పోయింది. తెదేపా అభ్యర్థి మండలి ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసినా, చివరకు పోటీనుంచి తప్పుకొని తెరాసలో చేరారు. జిల్లాలో సిపిఎం ఏ పార్టీకి ఓటువేసేది లేదని ప్రకటించింది. తెరాస, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ సాగుతోంది. ఉద్యమకాలంలో ఒక్కసారి కూడ జై తెలంగాణ అనని వ్యక్తికి తెరాస టికెట్ ఇచ్చిందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. తన సోదరుడి గెలుపునకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాల్లో రెండు స్థానాలను గెలుచుకుంటామని తెరాస ధీమా వ్యక్తం చేస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు స్థానాలుండగా, ఒక దానిలో గెలుపు సులభంగానే ఉందని, రెండో స్థానంలో మాత్రం గట్టి పోటీ ఉంటుందని తెరాస నేతలు చెబుతున్నారు.
సెల్‌ఫోన్లు అనుమతించం: భన్వర్‌లాల్
బూత్‌ల్లోకి సెల్‌ఫోన్లు, కెమెరాలు అనుమతించేది లేదని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఐదుగురు చొప్పున నల్లగొండలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో, సబ్ డివిజన్‌లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 30న ఓట్లలెక్కింపు జరుగుతుంది. ఓటు ఎవరికి వేసింది చెప్పడం ఎన్నికల నియమావళి ప్రకారం నేరమవుతుందని భన్వర్‌లాల్ తెలిపారు.
** మీడియాతో మాట్లాడుతున్న ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ **