తెలంగాణ

టిఆర్‌ఎస్ వ్యూహానికి టిడిపి, కాంగ్రెస్ చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 26: గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ వ్యూహానికి టిడిపి, కాంగ్రెస్‌లు చెక్ పెట్టాయ. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహానే్న గ్రేటర్‌లో కూడా అనుసరించాలని టిఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించినా టిడిపి, కాంగ్రెస్ ముందుగానే పసిగట్టి చివరి వరకు కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. నామినేషన్లు ఉపసంహరణ రోజే నేరుగా పార్టీ నాయకులు, అభ్యర్థుల కుటుంబ సభ్యులు బీఫాంలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. టిఆర్‌ఎస్ నాయకులు ఎక్కడ తమ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తారోనన్న ఉద్దేశంతో ముందుగానే ఎన్టీఆర్ భవన్‌కు తరలించగా కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థులను గాంధీభవన్‌కు తరలించింది. గ్రేటర్ ఎన్నికల ముందే అనేక మంది ముఖ్యనేతలు, సీనియర్ నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. అదే విధంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు టిఆర్‌ఎస్‌లో చేరడం టిడిపికి చావుదెబ్బ తగిలినట్లయింది. దీంతో పది డివిజన్లలో అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది.