రాష్ట్రీయం

తెరాసపై బిజెపి వైఖరేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర నేతల విమర్శలు.. కేంద్ర మంత్రుల పొగడ్తలు
శభాష్ కెసిఆర్ అని పొగిడిన కేంద్ర మంత్రి సింగ్
అక్కడ మోదీ...ఇక్కడ కెసిఆర్ అని కీర్తించిన కౌర్
కెసిఆర్‌కు 32 ప్రశ్నలు సంధించిన కిషన్ రెడ్డి
అయోమయంలో పార్టీ శ్రేణులు

హైదరాబాద్, నవంబర్ 22: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాలనపై కేంద్ర మంత్రుల పొగడ్తలు, బిజెపి రాష్ట్ర నాయకుల విమర్శలతో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్ ఉన్న నాయకుడని, కొత్త రాష్టమ్రైన తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు తాపత్రయపడుతున్నారని ఇటీవల కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ కితాబునిచ్చారు. తాజాగా ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ (అకాళీదల్) మరో అడుగు ముందుకేసి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన అద్భుతంగా ఉందని పొగిడారు. అంతేకాదు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కూడా కెసిఆర్‌ను పొగిడారు. ఐడిహెచ్ కాలనీలో చేపట్టిన రెండు పడకల గదుల ఇళ్ళ నిర్మాణం భేష్‌గా ఉందని పొగిడారు. ఇవన్నీ ఎప్పుడో కాదు తాజాగా వరంగల్ ఉప ఎన్నికకు ముందే అన్నారు. దీంతో పార్టీ రాష్ట్ర నాయకులకు చిర్రెత్తింది. ఒకవైపు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రిని పొగుడుతుంటే, తాము వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా విమర్శలు చేయడం ద్వారా ప్రజలు, పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని అంటున్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎంపి కవితి ఆహ్వానం మేరకు నిజామాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ముఖ్యమంత్రిపై పొగడ్తల వర్షం కురిపించారు. గత నెల ముఖ్యమంత్రి కెసిఆర్‌ను సిబిఐ అధికారులు ఒక అంశంపై విచారణ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ అంశం తన దృష్టికి రాలేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను హైదరాబాద్‌లో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. కాగా వరంగల్‌లో ప్రచారం చేసేందుకు వెళ్ళిన దత్తాత్రేయ కెసిఆర్‌పై నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓట్ల ద్వారా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పనున్నారని విమర్శించారు.
కేంద్ర మంత్రుల అభినందనలు, పొగడ్తల సంగతి ఎలా ఉన్నా ప్రతి రోజూ టిఆర్‌ఎస్, బిజెపి నాయకులు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. టిఆర్‌ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహారిస్తున్న తీరు ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. అంతేకాదు ఈ ప్రశ్నలకు బదులేదీ? అని ఆయన ముఖ్యమంత్రికి 32 ప్రశ్నలు సంధించారు. కాకతీయ విశ్వవిద్యాలయానికి 18 నెలలుగా వైస్-్ఛన్సలర్‌ను నియమించలేదని, హైదరాబాద్-వరంగల్ మధ్య ఇండస్ర్తియల్ కారిడార్ నిర్మిస్తామన్న హామీ ఏమైందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా దళితునే్న చేస్తామన్న హామీ ఏమైందని, గిరిజన తండాలను, గూడెంలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హామీ ఏమైందని, మహిళా విశ్వవిద్యాలయం ఏమైందని ఇలా 32 ప్రశ్నలు సంధించారు.
పరస్పర ఆరోపణలు..
మరోవైపు తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని ఎంపి కవిత, మంత్రులు కెటిఆర్, హరీష్‌రావు చేస్తున్న విమర్శలపై కిషన్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. ఇళ్ల కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ సభ్యులు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇళ్ల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన మేరకు కేటాయించడం జరిగిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నెపం నెడుతున్నాదని ఆయన విమర్శించారు. తప్పుడు ప్రచారం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇరు పార్టీల నాయకులు ఇలా పరస్పరం విమర్శించుకుంటున్నారు.