ఖమ్మం

వీడని ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మావోల చెరలోనే తెరాస నాయకులు
* పట్టించుకోని ప్రభుత్వం
* ఆందోళనలో కుటుంబ సభ్యులు
చర్ల, నవంబర్ 20: చర్ల మండల పరిధిలోని పూసుగుప్ప అటవీ ప్రాంతంలో ఆరుగురు టీఆర్‌ఎస్ నాయకులను కిడ్నాప్ చేసిన ఘటనపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. 72 గంటల నుంచి ఆరుగురు నాయకులు మావోల చెరలోనే ఉన్నారు. రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేయకపోవడంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. బుధవారం మధ్యాహ్నం పూసుగుప్ప గ్రామానికి వెళ్లిన టీఆర్‌ఎస్ నాయకులు మానె రామకృష్ణ, పటేల్ వెంకటేశ్వర్లు, సంతపూరి సురేష్, దబ్బకట్ల జనార్థన్, ఉయికా రామకృష్ణ, డెక్కా సత్యనారాయణలను మావోలు అపహరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తూ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖను వదిలిన సంగతి కూడా విదితమే. మావోయిస్టులు ఘాటుగా హెచ్చరించినా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా నాయకులను విడిపించేందుకు ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయకపోవడంతో బాధిత కుటుంబీకులు అసహనంతో పాటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేసేదిలేక బాధిత కుటుంబీకుల్లో కొందరు వారి కుటుంబాలతో వెళ్లి అడవుల్లో గాలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే పోలీసులు మాత్రం మావోల చెర నుంచి వారిని విడిపించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు. శుక్రవారం మధ్యాహ్నం పూసుగుప్ప గ్రామానికి చెందిన గిరిజనులు కొందరు టీఆర్‌ఎస్ నేతల కోసం అడవుల్లోకి వెళ్లి గాలించినట్లు సమాచారం.