జాతీయ వార్తలు

డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటన ఖరారైంది. ఆయన పర్యటన ఫిబ్రవరిలో ఉంటుందని భావిస్తున్నారు. ఈమేరకు వాషింగ్టన్ నుంచి వచ్చే సెక్యూరిటీ అండ్ లాజిస్టిక్ టీమ్స్ వచ్చే వారంలో ఇండియాకు వచ్చి, ట్రంప్ పర్యటనకు ఏర్పాట్లను పరిశీలించనున్నట్టు దౌత్య వర్గాలు,తెలిపాయి. ఫిబ్రవరి చివరి వారంలో ఈ పర్యటన ఉండవచ్చని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షి ష్రింగ్లా వెల్లడించారు. ఇండియాలో తన పర్యటనకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ట్రంప్ తన టీమ్ కు స్పష్టం చేసినట్టు ఆయన తెలిపారు. ఈ పర్యటనలో నవంబర్ 2018 నుంచి ఇరు దేశాల మధ్యా పెండింగ్ లో ఉన్న పలు వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. యూఎస్ ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ అలీస్ వెల్స్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజన్ మ్యాథ్యూ పొటింగర్ తదితరులు ఇండియాకు వచ్చి ట్రంప్ పర్యటనకు ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.