తెలంగాణ

ఉన్నత శిఖరాలకు ఎదగండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర,్ఫబ్రవరి 10: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి రాష్ట్ర పేరును మారుమోగేలా చూడాల్సిన బాధ్యత తెలంగాణ విద్యార్థులపై ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా బాసర బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో మూడవ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియంశ్రీహరి మాట్లాడుతూ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలనుండి వచ్చిన విద్యార్థులకు బాసర ట్రిపుల్ ఐటీ బాసటగా నిలుస్తుందని అన్నారు. సరస్వతీ దేవి కొలువైన అమ్మవారి క్షేత్రంలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించే విద్యార్థులు దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉన్నత విద్య దేశానికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారని అన్నా రు. విద్యార్థులు అన్ని విభాగాలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యాభివృద్ధికి విశేషంగా కృషిచేస్తుందని అన్నారు. లక్షా 75 వేల ఇంజనీరింగ్ సీట్లకు 90 వేల సీట్లే భర్తీ అవుతుండడంపై విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేవిధంగా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు 420 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో వంద రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టులను త్వరలోనే భర్తీచేస్తామని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి స్నాతకోత్సవ డ్రెస్‌కోడ్‌ను తీసివేసి నూతన విధానాన్ని ప్రవేశపెట్టాలని కళాశాల వైస్ ఛాన్స్‌లర్‌కు సూచించారు. కళాశాల అభివృద్ధి, విద్యార్థుల ప్రగతి, తదితర అంశాలను ఉన్నతవిద్యాశాఖ కమిషనర్ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ ఎ.అశోక్‌కుమార్ వివరించారు. సుమారు 150 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, ఆరుగురు విద్యార్థులకు బంగా రు పతకాలు, కళాశాల టాపర్ బొంతు అవీన్‌కుమార్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ఉదయ్‌బి దేశాయ్, కళాశాల ఏవో వెంకటస్వామి, ముధోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

చిత్రం..బాసర ట్రిపుల్ ఐటీ మూడవ స్నాతకోత్సవంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తున్న
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి