తెలంగాణ

ప్రథాని వ్యాఖ్యలపై కేసీఆర్ వౌనమేల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: పార్లమెంటు తలుపులు మూసి ఆంధ్ర ప్రదేశ్‌ను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఎందుకు స్పందించలేదని టి.పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఎఐసిసి నాయకురాలు సోనియా గాంధీపై, కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేశారని డాక్టర్ శ్రవణ్ ఆదివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. తెలంగాణ సమాజాన్ని ప్రధాని అవమానించినా, ముఖ్యమంత్రి స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటిని సాధించడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు ట్వీట్లు, చిట్-చాట్‌లతో ప్రధాని మోదీ మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కుట్ర అని గూగుల్లో టైప్ చేస్తే కేటీఆర్ ఫొటోలు కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. రాజకీయ కుట్రల్లో కేటీఆర్ వయస్సుకు మించిన వ్యవహారం కనిపిస్తున్నారని ఆయన అన్నారు. కుట్రకు పర్యాయపదంగా కేటీఆర్ మారారని ఆయన తెలిపారు.