తెలంగాణ

అక్రమాలకు అవకాశం లేకుండా రేషన్ సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు గత ఏడాది ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రయోగం విజయవంతం అయింది. ఇరవైమంది రిటైర్డ్ పోలీసు, రెవెన్యూ, వాణిజ్యపన్నుల అధికారులను కాంట్రాక్ట్ విధానంలో ఏడాది కింద నియమించుకుని ఐదుబృందాలుగా ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో పౌరసరఫరాల సంస్థ కొత్త పుంతలు తొక్కుతోందని కమిషనర్ సి.వి. ఆనంద్ తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పనితీరుపై సమీక్షించిన ఆయన ఆదివారం ఇక్కడ సంతృప్తి వ్యక్తం చేశారు. పైలట్ ప్రాజెక్టు విధానంలో ఏర్పాటు చేసిన ఈ విభాగం సమర్థతగా పనిచేస్తున్నందు వల్ల దాదాపు 500 కోట్ల రూపాయల మేరకు అక్రమాలు జరగకుండా కళ్లెం వేయగలిగామన్నారు. ఈ విభాగంపై కేవలం 1.25 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశామని, వీరి పనితీరుతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం మిగులుతోందన్నారు.
2017 ఫిబ్రవరి 1 న ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. రెండు నెలలపాటు కసరత్తు చేసి, నిజాయితీ, నీతి, నిబద్ధత, పనిసామర్థ్యం తదితర అంశాలను, ఉద్యోగుల గత సర్వీసును పరిశీలించి ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో నియామకాలు చేశారు. నిత్యావసర సరకులు దారిమళ్లకుండా చూడటం, ప్రభుత్వ, ప్రైవేట్ గోదాముల తనిఖీ, స్టేజ్-1, స్టేజ్-2 రవాణా తనిఖీలు, ఈపాస్ యంత్రాలు వాడటానికి ముందు, తర్వాత లావాదేవీల్లో వచ్చిన మార్పులు, జిపిఎస్ పనితీరు, సప్లైచైన్ మేనేజ్‌మెంట్ తదితర బాధ్యతలను ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి అప్పగించారు. ఈ విభాగం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేసి తప్పు చేసిన వారిపై కేసులు కూడా పెట్టింది. ఈ విభాగం నమోదు చేసిన కేసులపై జిల్లా కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకున్నారు.
2017 ఫిబ్రవరి నుండి 2018 జనవరి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మండలస్థాయి గోదాములు, రేషన్ దుకాణాలు, కస్టం మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) మిల్లులు, మధ్యాహ్న భోజనం కోసం సన్నబియ్యం అందుకునే సంస్థలు, హాస్టళ్లు, ఆశ్రమపాఠశాలలు, ఎల్‌పిజి గోదాములను తనిఖీ చేశారు. మొత్తం 843 ప్రాంతాల్లో దాడులు చేసి 6ఏ కేసులు 165 నమోదు చేశారు. అలాగే మరో 71 క్రిమినల్ కేసులను నమోదు చేశారు. మిల్లర్ల నుండి రావాల్సిన సిఎంఆర్‌ను పూర్తిస్థాయిలో రాబట్టారు. తప్పు చేసేందుకు ఎవరూ సాహసించడం లేదని ఆనంద్ స్పష్టం చేశారు.