తెలంగాణ

శాస్ర్తియత లోపించిన రోడ్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని వివిధ పట్టణాలు, గ్రామాల్లో ఒకవైపు రోడ్లు వేస్తుంటే, మరోవైపు ఏదో ఒక ఏజెన్సీ సదరు రోడ్డును తవ్వేస్తోంది. ప్రైవేట్ సంస్థలు జరిపిన సర్వే అంచనాల ప్రకారం మంచిరోడ్లను ఏదో ఒక పనిపేరుతో తవ్వకం వల్ల ప్రభుత్వానికి ఏటా దాదాపు 200 కోట్ల రూపాయల వరకు నష్టం వస్తోంది. ప్రత్యేకంగా సిమెంట్ రోడ్లను తవ్విన తర్వాత సిమెంట్ గడ్డలను అలాగే తవ్విన స్థలంలో వదిలివేస్తున్నారు. అలాగే తారురోడ్లను తవ్విన చోట్ల కూడా తారుగడ్డలను అలాగే వదిలివేస్తున్నారు. రోడ్లు తవ్వి అలాగే వదిలివేయడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. సిమెంట్ కాంక్రీట్ రోడ్లతో పాటు తారురోడ్లు (బ్లాక్ ట్యాప్) రోడ్లను జనం రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నాణ్యతాప్రమాణాల మేరకు వేస్తుంటారు. రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖలు దాదాపు రెండువేల కోట్ల రూపాయలుపైగా రోడ్ల కోసం ఖర్చు చేస్తున్నాయి. సిమెంట్ రోడ్లకు కిలోమీటర్‌కు దాదాపు ఐదుకోట్ల రూపాయలు, తారురోడ్లకు కోటి నుండి మూడుకోట్ల రూపాయలపైగా వ్యయం చేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసి రోడ్లను వేసిన కొద్ది కాలంలోనే నీటిపైపులైన్లపేరుతో, మురుగునీటి పైప్‌లైన్లపేరుతో, వివిధ సంస్థలకు సంబంధించిన కేబుళ్లను వేసేందుకు నిర్దాక్షిణ్యంగా తవ్వివేస్తున్నారు. రోడ్లను తవ్వే సమయంలో సంబంధిత అధికారుల అనుమతి కూడా చాలా ప్రాంతాల్లో తీసుకోవడం లేదు. వాస్తవానికి ఎక్కడైనా రోడ్లు తవ్వాలంటే స్థానిక సంస్థల నుండి లేదా రోడ్లు ఎవరి అధీనంలో ఉంటే వారి అనుమతి తీసుకోవాలి. తప్పని సరిపరిస్థితిలో రోడ్లను తవ్విన తర్వాత మళ్లీ యథాతథంగా రోడ్లను వేసేందుకు రోడ్లనుతవ్విన సంస్థ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల అధికారులు పట్టించుకోకపోయినా, లేక కుమ్మక్కయినా తవ్విన రోడ్లు అలాగే ఉండిపోతున్నాయి.
విధానం లేకపోవడమే కారణం
రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ తదితర శాఖలు రోడ్లు వేసే సమయంలో వివిధ శాఖల అధికారులతో నిబంధనల ప్రకారం చర్చలు జరపాల్సి ఉంటుంది. రోడ్లు వేసే ప్రాంతాల్లో ఏవైనా కేబుళ్లువేసే ప్రతిపాదనలు ఉన్నాయా, పైపులు వేసే ప్రణాళికలు ఉన్నాయా అన్న అంశంపై పరిశీలించాలి. తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, బిఎస్‌ఎన్‌ఎల్, విద్యుత్తు తదితర శాఖలకు చెందిన వారితో పాటు ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్లు, ఓఎఫ్‌సి లైన్లు వేసే ప్రైవేట్ సంస్థలతో కూడా చర్చలు జరపాల్సి ఉంటుంది. రోడ్డు వేసిన తర్వాత కనీసం ఐదేళ్ల వరకు సదరు రోడ్డును తవ్వకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. ఒకవైపు రోడ్లు వేస్తూ వెళుతుండగా, మరోవైపు తవ్వతూ వెళితే ప్రభుత్వం సొమ్ము వృథా అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్‌లో రోడ్లను తవ్వడాన్ని నిషేధిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి. జనార్ధన్‌రెడ్డి 2017 మే లో ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని రోడ్లు తవ్వుతున్న వ్యవహారాన్ని పరిశీలిస్తే అర్థమవుతోంది.