తెలంగాణ

యుపిఏ ఇచ్చింది-ఎన్డీయే తోసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణననే ఎక్కువ నష్టపోయిందని టిఆర్‌ఎస్ ఎంపి కె కేశవరావు రాజ్యసభలో ఇటీవల వాపోయిన దాంట్లో వాస్తవం లేకపోలేదు. రాష్ట్ర విభజనకు ఏడాది ముందు 2013లో హైదరాబాద్‌కు ఇన్‌ఫార్మెషన్ టెక్నాలజీ ఇన్‌వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటిఐఆర్) ప్రాజెక్టును అప్పటి యుపిఏ-2 ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటు వల్ల హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా 15 లక్షల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 53 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని కేంద్రమే లెక్కకట్టి చెప్పింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కాకుండా ఐటిఐఆర్ ప్రాజెక్టు వల్ల రూ.2 లక్షల 19 వేల 440 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచన వేసింది. దీని వల్ల రాష్ట్రానికి అదనంగా రూ.30,170 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఐటిఐఆర్ ప్రాజెక్టుపైనే ఎక్కువ దృష్టి సారించి ఆ దిశగా వౌలిక సదుపాయాల కల్పనపై ప్రణాళికలకు కసరత్తు చేసారు. ఐటిఐఆర్ ప్రాజెక్టు వల్ల హైదరాబాద్ మరో సిలకాన్ వ్యాలీగా, విశ్వనగరంగా మారడానికి దోహదపడుతుందని ఆకాంక్షించారు. యుపిఏ ప్రభుత్వం ప్రకటించిన ఐటిఐఆర్ ప్రాజెక్టును అమలు చేయాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె తారకరామారావు ప్రత్యేకంగా ఇదే అంశంపై పదే పదే ఢిల్లీ వెళ్లి కేంద్రంపై వత్తిడి తెచ్చినా ఫలితం లేకపోయింది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు మంత్రి కెటిఆర్ వ్యక్తిగత వత్తిడి వల్ల ఈ అంశాన్ని ఏన్డీయే ప్రభుత్వం మంత్రిమండలిలో కూడా చర్చించింది. అయినప్పటికీ ఆ దిశగా ఎన్డీయే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇంత పెద్ద ప్రాజెక్టును రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఏర్పాటు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదన్న కోణంలో కేంద్రం పక్కన పెట్టిందేమోనన్న అభిప్రాయానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. ఇదే భావనతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఐటిఐఆర్ ప్రాజెక్టుపై రానురాను వత్తిడి చేయడం మానుకుంది. ఏన్డీయే ప్రభుత్వం నిరాసక్తత, తెలంగాణ ప్రభుత్వం అనాసక్తత వల్ల ఐటిఐఆర్ ప్రాజెక్టు అందని ద్రాక్షగా మారింది. రాష్ట్ర విభజన వల్లనే హైదరాబాద్‌కు ఐటిఐఆర్ ప్రాజెక్టు రాకుండా పోయింది. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ అన్యాయం జరిగిందని ఎంపి కేశవరావు చెప్పిన దాంట్లో ఐటిఐఆర్ ప్రాజెక్టు ప్రధానమైంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌కు రావాల్సిన ఐటిఐఆర్ ప్రాజెక్టు అటకెక్కడం వల్ల 15 లక్షల ప్రత్యేక్ష, 53 లక్షల పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రూ. 30 వేల కోట్ల ఆదాయం, రూ.2.20 లక్షల పెట్టబడులను కోల్పోయింది. విభజన హామీలలో తెలంగాణకు ఇవ్వాల్సిన వాటన్నింటినీ పక్కన పెట్టి అయినా ఒకే ఒక్క ఐటిఐఆర్ ప్రాజెక్టును ఇచ్చి ఉంటే ఈ పాటికి హైదరాబాద్ విశ్వనగరంగా మారేదనడం నిస్సాందేహం.