తెలంగాణ

ఉగ్రవాద సవాళ్లకు ధీటుగా పోలీసు దళాలకు శిక్షణ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: భవిష్యత్‌లో ఉగ్రవాద, తీవ్రవాదాన్ని దేశ పోలీసు దళాలు సమర్ధవంతంగా ఎదుర్కొనే విధంగా శిక్షణ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి అన్నారు. సోమవారం నాడిక్కడ రాష్ట్ర పోలీసు సెక్యూరిటీ విభాగం నిర్వహించిన పోలీసు జాగిలాలు, వాటి సంరక్షకుల 17వ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ పరేడ్‌లో 71 పోలీసు జాగిలాలు, 92 మంది సంరక్షకులు అందించిన గౌరవ వందనాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి స్వీకరించారు. డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న తీవ్రవాదాన్ని అరికట్టేందుకు పోలీసు దళాళలకు అందించే శిక్షణ, మెళుకువలను ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెన్స్ ట్రైనింగ్ అకాడమి వేగవంతం చేయాలని సూచించారు. జాగిలాలకు అద్భుతమైన శిక్షణ ఇవ్వడం, అందుకు అవసరమైన నిర్వాహకులకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమని చెప్పారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన పోలీసు జాగిలం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పుష్ప గుచ్ఛం అందించి పరేడ్‌లో స్వాగతం పలికింది. పరేడ్ అనంతరం శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వాటికి బహుమతులను ప్రదానం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఆరు, త్రిపురకు చెందిన 4, సిఐఎస్‌ఎఫ్‌కు చెందిన 3, తెలంగాణ గ్రేహౌండ్స్‌కు చెందిన 2, ఆక్టోపస్‌లోని 3, ఐఎస్‌డబ్ల్యూ 2, 51 జాగిలాలు తెలంగాణ పోలీసు శాఖలోని మిగిలిన యూనిట్ల నుంచి శిక్షణ తీసుకున్నాయి. వీటికి నేరస్తుల జాడ కనిపెట్టడం, దాడులు, నార్కోటిక్ నేరాలు వంటి వాటిలో ఎలా వాసన పసిగట్టి నేరగాళ్ళను పట్టించడం అనే అంశాలపై కఠినమైన శిక్షణ అందించారు. లాబ్రడార్, జర్మన్ షెప్పర్డ్, బెల్జియన్ మాలినోయిస్, డాబర్‌మెన్, గోల్డెన్ రిట్రీవర్ వంటి జాతి రకం జాగిలాలు ఈ శిక్షణ పొందాయి. ఈ కార్యక్రమంలో ఇంటిలిజెన్స్ ఐజి నవీన్‌చంద్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.