తెలంగాణ

తక్కువ ఖర్చుతో ప్రాణాంతక వ్యాథులకు చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తక్కువ ఖర్చుతో ప్రాణాంతక వ్యాధులకు చికిత్స అందించేందుకు వివిధ పరిశోధనలు జరుగుతున్నాయని, అందుకు 10 ప్రాజెక్టులకు పరిశోధనల బాధ్యతలను అప్పగించినట్టు అటవీ , పర్యావరణ, బిసి సంక్షేమ మంత్రి జోగు రామన్న తెలిపారు. సోమవారం నాడు సచివాలయంలో తమ ఛాంబర్‌లో జరిగిన రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ మధ్యంతర సమీక్షా సమావేశంలో మంత్రి జోగు రామన్న సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం అత్యంత ఖరీదుగా మారిన వైద్య పరీక్షలను ప్రజలకు చౌకగా అందించేందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ తరఫున కృషి చేస్తున్నట్టు తెలిపారు. క్యాన్సర్, కిడ్నీ, మైగ్రేన్, తలసేమియా వంటి ప్రాణాంతక వ్యాధులకు తక్కువ ఖర్చుతో వైద్యం ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. వివిధ వ్యాధుల పరిశోధనల బాధ్యతను ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు అప్పగించామని అన్నారు. ఇందుకోసం 50 లక్షలు మంజూరు చేశామని చెప్పారు. తొలి విడతగా 25 లక్షలు విడుదల చేశామని ఆయన తెలిపారు. స్థానిక పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివరించారు. వాన నీటిని భూగర్భ జలాల్లోకి డైరెక్ట్‌గా కలపడం ద్వారా నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ శాతాన్ని క్రమంగా తగ్గేలా చర్యలు తీసుకుంటున్నట్టు శాస్తవ్రేత్తలు చెప్పారు. జెఎన్‌టియు ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో మర్రిగూడ మండల పాఠశాలలో దీనిని ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్లలో రేడియేషన్ గుర్తించడానికి మరో ప్రాజెక్టు చేపట్టామని అన్నారు. జీపీఎస్ ద్వారా రోడ్డు ప్రమాదాలను క్రోడీకరించి ఇ మెసర్‌మెంట్ బుక్‌ను తయారుచేయడం కూడా ఒక ప్రాజెక్టుగా చేపట్టామని అన్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సైన్స్ సిటీలో జరిగిన జాతీయ స్థాయి కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ఇద్దరు బాల శాస్తవ్రేత్తలు అరీబా అయ్యేన్, మహేందర్‌రెడ్డిలు అద్భుతమైన ప్రతిభ కనబరిచి జాతీయ బృందానికి ఎంపికయ్యారని అన్నారు. సమీక్షలో అటవీశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్, మెంబర్ సెక్రటరీ జీ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.