తెలంగాణ

గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, ఫిబ్రవరి 15: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగిరిజనుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని శంకరాయపల్లి తండా వద్ద గిరిజనులు ఎర్పాటు చేసిన సంత్ సేవాలాల్ 279వ జయంతి ఉత్సవంలో మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొని బంజారా భవన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంజార భవన్ నిర్మాణానికి అవసరమైన రూ.20లక్షలు ప్రభుత్వం మంజూరుచేసిందని వివరించారు. టెండర్లు పూర్తి అయిన తరువాత శిలాఫలకం ఏర్పాటు చేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిద్దామని మంత్రి వెల్లడించారు. సంత్ సేవాలాల్ వచ్చే జయంతిని బంజారాభవన్‌లోనే నిర్వహిద్దామ ని ఆయన అన్నారు. ఇక్కడ నిర్మించనున్న భవ నం ద్వారా మండలంలోని అన్ని గ్రామాల గిరిజనులకు ఎంతో ఉపయోగకరం గా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన పునరుద్ఘాటించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను కూడా గిరిజనులు అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకుంటూ ముందుకుసాగుతున్నారని ఆయన అభినందించారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తండాలకు వెళితే వారి సమస్యలపై గిరిజనులు ఏకరువుపెట్టేవారని గుర్తుచేశారు. రోడ్డుసమస్య,నీటి సమస్య,ఇళ్ల సమస్య, విధ్యుత్ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చేవారని ఆయన వివరించారు. తెలంగాణ స్వరాష్ట్రంలో ఒక్కోక్క సమస్యను అధిగమిస్తూ ప్రభు త్వం ముందుకు సాగుతుందని ఆయన వెల్లడించారు. గ్రామాలకు బీటీ రోడ్లు, విద్యుత్ సమస్యలు పూర్తయ్యాయని అని అన్నారు. త్వరలోనే తండాలు కూడా గ్రామ పంచాయతీలుగా మారనున్నాయని వివరించారు. మిషన్ భగీరథ లో భాగంగా ప్రతి గ్రామానికి మంచి నీరు మార్చి నెలలో రానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ జయప్రద, కావేరమ్మపేట గ్రామ సర్పంచ్ బుక్కావెంకటేశం, టీఆర్‌ఎస్ నాయకులు శంకర్ నాయక్, గోపాల్ నాయక్, రమేశ్ నాయక్, గురువు జోధ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.