తెలంగాణ

మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. మద్రాస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు శనివారం చెన్నైలో జరిగిన సంస్థ 2018 వార్షిక సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సు ముగింపు సమావేశానికి మంత్రి హాజరై ‘లర్నింగ్ టు గ్రో’ అనే అంశంపై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర గత మూడు సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టిందో వివరించారు. ప్రభుత్వం చేపట్టిన వినూత్న విధానాలు, ముందు చూపు ఉన్న నాయకత్వం ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తున్నదని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజల ప్రాథమిక అంశాలైన విద్యుత్తు, తాగు నీరు వంటి వాటికి ప్రాధాన్యతనిస్తూ వచ్చామని, అందుకే విద్యుత్తు కొరత నుంచి మిగులు విద్యుత్తు వరకు వచ్చామని ఆయన వివరించారు. తమ ఆలోచనలు ఫలించి ఇప్పటి వరకూ టిఎస్-ఐపాస్ పాలసీ ద్వారా సుమారు 6000లకు పైగా అనుమతులు ఇచ్చామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాలూ తమ ప్రభుత్వ విధానాలు, పథకాల పట్ల ఆసక్తి చూపిస్తున్నాయని ఆయన వివరించారు. యువత ఆశలకు అనుగుణంగా ప్రభుత్వాలు భరోసా కల్పిస్తే యువ శక్తి దేశాన్ని మరింత ముందుకు నడిపిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.