తెలంగాణ

ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. రాష్టప్రతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి ఎం. వెంక య్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, బీహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి, ఎంపి జ్యోతిరాతిద్య సింథియా, రాష్ట్ర మంత్రులు, అధికారులు, అనధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు క్యాంపు ఆఫీసు వద్ద బారులు తీరారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యాంపు కార్యాలయం, ఆ పరిసరాలూ కిటకిటలాడాయి. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో నెక్లెస్ రోడ్డులో కేసీఆర్ బర్త్-డే ఘనంగా జరిగింది. ఎంపీ కవిత కేక్ కట్ చేశారు. జల విహార్‌లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని కవితతో పాటు టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. దివ్యాంగులకు వీల్ చైర్స్, అంధులకు చేతి కర్రలు, మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రాంమోహన్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంత రావు మల్కాజ్‌గిరి, అల్వాల్‌లో బర్త్-డే వేడుకలు నిర్వహించారు. మంత్రి తలసాని సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన ఆయుష్షు హోమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ కవిత పాల్గొన్నారు. ఆ తర్వాత బన్సిలాల్‌పేట డివిజన్‌లో చాచా నెహ్రూ నగర్‌లో 2.64 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న 265 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి వారు భూమి పూజ చేశారు.
ఆ తర్వాత వారు జల విహార్‌కు చేరుకుని భారీ కేక్‌ను కట్ చేశారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆట, పాటలు అందరినీ అలరించాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరోవైపు నాయకులు తమ అనుచరులను తీసుకుని హైదరాబాద్‌కు తరలి రావడంతో బేగంపేట, సోమాజిగుడా, బంజారాహిల్స్, లక్‌డీకాపూల్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

చిత్రాలు..ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌టిఐ కమిషనర్ బుద్దా మురళి
*మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో నెక్లెస్ రోడ్డులో జరిగిన కేసీఆర్ బర్త్-డే వేడుకల్లో
కేక్ కట్ చేస్తున్న ఎంపీ కవిత, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు