తెలంగాణ

ఐక్య ఉద్యమాలతో పాలక పార్టీలకు పాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 17: కేంద్ర, రాష్ట్రాలలో పాలకులు అనుసరిస్తున్న విధానాలకు వామపక్షాల ఐక్య ఉద్యమాలతో పాతర వేయాలని సీపీ ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా సీపీఐ మహాసభల్లో భాగంగా శనివారం ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వామపక్షాలు సమైక్యంగా సమన్వయం తో ఉద్యమించి బీజేపీ, సంగ్ పరివార్ లాంటి వాటిని తరిమివేయాల్సిన అవసరం ఉందన్నా రు. ఇందుకోసం దేశవ్యాప్తంగా వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులతో సమైక్య శక్తిని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నామని, దానిద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి పాలకులపై ఉద్యమానికి సన్నద్ధం అవుతామని స్పష్టం చేశారు. మూడున్నరేళ్ళలో ప్రపంచంలో అగ్రరాజ్యాల పెత్తనం పెరిగిపోయి పొరుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను చెడగొట్టి యుద్ధాలకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా అవినీతిలో కూరుకుపోయిందని, బయటపడేందుకు మాయ మాటలతో ఇతర దేశాల పర్యటనలతో మభ్యపెడుతున్నారన్నారు.