తెలంగాణ

కేసీఆర్ జన్మదిన వేడుకలో అపశ్రుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, ఫిబ్రవరి 17: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకల్లో మంచిర్యాల కేంద్రంలో అపశృతి చోటు చేసుకుంది. శనివా రం జన్మదిన వేడుకలతో పాటు మున్నుర్ కాపు సం ఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి జోగు రామన్న హాజరయ్యారు. ముందుగా కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్బంగా కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసా రు. పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు టపాసులు పేల్చారు. టపాసులు పేలుళ్లతో షామియానా లకు నిప్పు అంటుకొని పెద్ద ఎత్తున్నమంటలు చెలరేగాయి. ఈ మం ట ల్లో షామియానాలు కుర్చీలు దగ్ధం అయ్యాయ. ముందుగా షామియా నాపై మంటలను గుర్తించిన మంత్రి అక్కడనుం చి మంట లు చెలరేగుతున్నాయని అనడంతో పరుగులు తీశారు. కార్యక్రమం వద్ద ఉన్న మం చిర్యాల ఇన్‌చార్జ్ సీఐ ప్రమోద్ రావు తోపాటు ఎస్సై శ్రీనివాస్ అప్రమత్తం అయ్య ఫైరింజన్‌కు సమాచారం అందించారు. పోలీసులు స్థానికం గా ఉన్న నీటితో మంటలను అర్పేశారు. ఈ ప్రమా దం నుంచి మంత్రి జోగు రామన్న , ప్రభుత్వ విప్‌నల్లా ల ఓదెలు, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు సురక్షితంగా బయట పడ్డారు.

చిత్రం..మంటల్లో దగ్ధం అయిన కుర్చీలు