తెలంగాణ

అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: దేశ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బడ్జెట్‌లో వివక్షకు తావులేకుండా అన్ని రాష్ట్రాలకు సమన్యాయం పాటించార ని, తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందనడంలో వాస్తవం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం హైరి అన్నారు. శనివారం ఆదిలాబాద్‌లో 130 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం మం జూరు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను కేంద్ర మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా స్వచ్చ్భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ దివ్య, రిమ్స్ డైరెక్టర్ అశోక్, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి ఆసుపత్రి ఆవరణలో చెత్త చెదారాన్ని ఊడ్చివేస్తూ తొలగించారు. ఈ సందర్భంగా అక్కడే విలేఖరుల తో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతూ బడ్జెట్‌లో నిధులు కేటాయింపు జరిపారని, వెనకబడిన ప్రాంతాలకు సైతం దూరదృష్టితో ప్రాధాన్యతకల్పించారని అన్నా రు. తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతుందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి ఇతోధికంగా నిధులు మంజూరు చేస్తూ ఇరు రాష్ట్రాలతో తమ ప్రభుత్వం సఖ్యతతో వ్యవహరిస్తుందని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి వివక్షతకు తావులేకుండా నిధుల కేటాయింపు జరిగిందని, రైల్వే బడ్జెట్‌లో సైతం ముందు చూపుతో వెళ్తున్నట్టు చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధి వెనుక కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఎంతో ఉందని, రాష్ట్రం భరించే రాయితీల్లో 80 శాతం కేంద్రం వాటా ఉంటుందన్న విషయా న్ని గుర్తించాలని కేంద్ర మంత్రి అన్నా రు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఆధునిక వైద్యసేవలు విస్తరించాలన్న లక్ష్యంతోనే సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మి స్తామ ని, సేవాదృక్పథంతో వైద్యులు పనిచేసేందు కు ముందుకు రావాలని కేంద్ర మంత్రి సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, రాష్ట్ర నాయకులు చిట్యాల సుహాసిని రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..రిమ్స్ ఆసుపత్రిని సందర్శిస్తున్న కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారాం, కలెక్టర్ దివ్య, ఎస్పీ విష్ణు