తెలంగాణ

హైదరాబాద్‌లో అడోబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: మరో ఐటీ దిగ్గజం తెలంగాణకు రానుంది. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా ఐటీ దిగ్గజం అడోబ్ చైర్మన్, సిఇఓ శంతను నారాయణ్‌తో ఐటీ మంత్రి కె తారక రామారావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో అడోబ్ కేంద్రాన్ని నెలకోల్పాలని మంత్రి కేటీఆర్ కోరారు. 2015 మే నెలలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో శంతను నారాయణ్‌తో తొలిసారి కేటీఆర్ సమావేశమైన తర్వాత పలుమార్లు ఆయనను కలిశారు. కలిసిన ప్రతిసారీ హైదరాబాద్‌లో అడోబ్ కార్యకలాపాలు విస్తరించాలని కోరారు. మంత్రి కోరికను అడోబ్ అధినేత మన్నిస్తూ, విస్తరణ ప్రణాళికలో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఇస్తామని అన్నారు. త్వరలోనే అడోబ్ సంస్థ తన ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్ కేంద్రాన్ని తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నెలకోల్పుతుందని అన్నారు. గత మూడున్నరేళ్లలో ఐటీ రంగంలో హైదరాబాద్ గణనీయమైన ప్రగతిని సాధించిందని, నూతన టెక్నాలజీలపై ఇక్కడ సుశిక్షిత యువతరం లభ్యత ఉందని శంతను పేర్కొన్నారు.
ఫైబర్ గ్రిడ్ ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ఫలితాలను తెలిపే పైలట్ ప్రాజెక్టు టెక్నాలజీ డిమాన్‌స్ట్రేషన్ నెట్‌వర్కును కేంద్ర ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించారు. నెట్ వర్కు ప్రారంభించిన తర్వాత ఆయన కెటిఆర్‌ను అభినందించారు. మహేశ్వరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నెలకోల్పిన ఇ క్లాసు రూమ్‌లో ఉన్న విద్యార్ధులతో మంత్రి సంభాషించారు. మన్‌సాన్‌పల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న రోగికి హైదరాబాద్‌లో ఉన్న డాక్టర్ టి ఫైబర్ ద్వారా అందించిన టెలి మెడిసిన్ సేవలను పరిశీలించారు. తుమ్మలూరు గ్రామంలో నెలకోల్పిన అత్యాధునిక కియోస్క్ ద్వారా గ్రామస్థులకు అవసరం అయిన ప్రభుత్వ సేవలను వీడియోకాన్ఫరెన్స్ సదుపాయాన్ని మంత్రి తిలకించారు. ప్రముఖులతో భేటీ వరల్డ్ ఐటి కాంగ్రెస్‌లో భాగంగా కె టి రామారావు పలువురు ఐటి దిగ్గజాలతో భేటీ అయ్యారు. ఉదయం రీ థింకింగ్ గవర్నెన్స్ ఇన్ డిజిటల్ ఎకనామి అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు దేశాల ఐటి మంత్రులతో కూడా పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ఐటి మంత్రి జునైద్ అహ్మద్ పాలక్, శ్రీలంకకు చెందిన హరీన్ ఫెర్నాండో, ఆర్మేనియాకు చెందిన వాహన్ మార్టీరోస్యన్ , నైజీరియాకు చెందిన అబ్దుల్ రహీమ్‌లతో భేటీ అయ్యారు. కేటీఆర్ ఆర్టీసీ ఎం వ్యాలెట్ గురించి ప్రస్తావించారు. తెలంగాణలో తీసుకొచ్చిన పలు ఐటీ సంస్కరణల గురించి వివరించారు.
కెనడా మంత్రితో భేటీ
కెనడా దేశ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి నవదీప్ బెయిన్స్‌తో కెటిఆర్ భేటీ అయ్యారు. కెనడాకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, కమ్యూటెక్ సంస్థలతో టిహబ్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు కెనడా మంత్రి కెటిఆర్‌కు తెలిపారు.