తెలంగాణ

ఎమ్మెల్యేల బహుళ అంతస్తుల వసతి నిర్మాణంలో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఎమ్మెల్యేల కోసం హైదరాబాద్‌లో చేపట్టిన బహుళ అంతస్తుల వసతి సముదాయం నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే మార్చిలోగా నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాల్సిందిగా ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి తుమ్మల ఆర్ అండ్ బి అధికారులతో సమీక్షించారు. నూతన కలెక్టరేట్‌ల నిర్మాణం, అతిథి గృహాల నిర్మాణం, ఎమ్మెల్యేల వసతి, ఇతర భవనాల నిర్మాణం వంటి పనులకు ఇంకా భూ సేకరణ మొదలు కాకపోవడంపై ఆయన విస్మయం చెందారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కార్యాలయం, వసతి నిర్మాణం గురించి అడిగారు. పనుల్లో జరుగుతున్న జాప్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు మరింత వేగవంతం చేయాలని, స్థలాల ఎంపికలో జాప్యం చేయరాదని మంత్రి తుమ్మల సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఇఎన్‌సి గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.