రాష్ట్రీయం

హిమాలయాల నుంచి గోదావరికి అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హిమాలయాల నుంచి మానస్- సంకోష్- తీస్త- గంగా- సువర్ణరేఖ- మహానది మీదుగా గోదావరికి నదుల అనుసంధానం చేపట్టాలని మంగళవారం హైదరాబాద్‌లో జరుగనున్న దక్షిణాది జలవనరుల ప్రాంతీయ సదస్సులో నీటిపారుదల మంత్రి టి హరీశ్‌రావు కోరనున్నారు. హిమాలయాల నుంచి నదీ ప్రవాహాలను గోదావరికి మళ్లించడం ఒక్కటే భవిష్యత్ తరాలకు నీటి కొరతను తీర్చగలదని ఆయన ప్రతిపాదించనున్నారు. దీనివల్ల 938 టీఎంసిల నీటితో గోదావరికి అనుసంధానం చేయడం వల్ల దక్షిణాది వాటర్ గ్రిడ్ పటిష్టం అవుతుందని హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ, కర్నాటక,తమిళనాడు రాష్ట్రాలు ముఖ్యంగా కృష్ణా బేసిన్‌లో భవిష్యత్‌లో నీటి కోరతకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని మరోసారి ఈ సదస్సు ద్వారా కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి నదులలో తెలంగాణ వాటా తేల్చాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం ఈ సదస్సులో గట్టిగా కోరనుంది. కృష్ణాలో ఆంధ్రప్రదేశ్ 512, తెలంగాణ 299 టీఎంసిలు వాడుకునేందుకు ఒక ఏడాది కోసం ఒప్పందం కుదిరింది. అయితే నాలుగేళ్లు అయినా నీటి కేటాయింపులు జరుగకపోవడాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించడంతో పాటు తెలంగాణ వాటా తేల్చాలని గట్టిగా వాదించాలని నిర్ణయించింది. ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటకలోని కావేరి వరకు అనుసంధానం చేపట్టాలని కేంద్రం తొలుత నిర్ణయించిన విషయం తెలిసిందే. మహానది నుంచి గోదావరికి మిగులు జలాలు తెచ్చాకే కావేరి అనుసంధానం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. నదుల అనుసంధానంపై దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోవడానికే హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాలతో కేంద్ర సమావేశం ఏర్పాటు చేయడంతో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
కృష్ణా బోర్డు పరిధిలోకి అంతరాష్ట్ర ప్రాజెక్టు తుంగభద్రను తీసుకురావాలని కూడా కేంద్రాన్ని డిమాండ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేయనుంది.