తెలంగాణ

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు అత్యుత్తమ సంవత్సరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: హైదరాబాద్‌కు రియల్ ఎస్టేట్ రంగంలో 2018 అత్యుత్తమ సంవత్సరంగా నిలుస్తుందని, వచ్చే నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మూడు రోజుల పాటు 6వ ఎడిషన్ క్రెడాయ్ ప్రాపర్టీని హైటెక్స్‌లో నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ అధ్యక్షుడు ఎస్ రామ్‌రెడ్డి చెప్పారు. ఈ ప్రదర్శనలో 120 మంది డెవలపర్లు పాల్గొంటారన్నారు. 15వేలకు పైగా ప్రాజెక్టులను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, అపార్టుమెంట్ కాంప్లెక్స్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, రిటైల్ కమర్షియల్ కాంప్లెక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ ఉన్న గ్రీన్ బిల్డింగ్‌లు ఉంటాయన్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ అత్యుత్తమ నాణ్యమైన జీవన ప్రమాణాలను భారతదేశంలో ఇతర నగరాలతో పోల్చినప్పుడు అందిస్తుండడం వల్ల వేగవంతంగా నగరీకరణను హైదరాబాద్ చూస్తోందన్నారు. మానవ వనరుల అభివృద్ధి సూచికలో హైదరాబాద్ అగ్రగామిగా ఉందన్నారు. పెట్టుబడులను ఆకట్టుకోవడంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలు ముందంజలో ఉన్నాయన్నారు. 2017 నాటికి నగరంలో కమర్షియల్ స్టాక్ 56 మిలియన్ చదరపు అడుగులు ఉంటే, 6.8 మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్‌ను లీజ్‌కు ఇచ్చారన్నారు. వ్యవస్ధీకృత రిటైల్ స్పేస్ 2.9 మిలియన్ చదరపు అడుగులు కాగా, రాబోయే కొద్ది సంవత్సరాల్లో 3.7 మిలియన్ చదరపు అడుగుల స్థలం విడుదల కానుందని చెప్పారు. జనరల్ సెక్రటరీ పి రామకృష్ణారావు మాట్లడుతూ హైదరాబాద్‌లోరియల్ ఎస్టేట్ రంగం పారదర్శకత, అనుకూల వాతావరణం వైపు ప్రయాణం చేస్తోందన్నారు. నగరంలో గృహ రంగానికి విపరీతమైన డిమాండ్ రానుందని చెప్పారు.
నగరంలో ఆస్తులను కొనుగోలు చేయాలనుకునే వారికి సహాయపడేందుకు అన్ని ప్రాజెక్టులను ఒకే చోట ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్రెడాయ్ కోశాధికారి కె రాజేశ్వర్ మాట్లడుతూ స్థిరమైన అభివృద్ధితో రియాల్టీ రంగం దూసుకుపోతోందన్నారు.

చిత్రం..6వ ఎడిషన్ క్రెడాయ్ ప్రాపర్టీని హైటెక్స్‌లో నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ తెలుపుతున్న
అధ్యక్షుడు ఎస్ రామ్‌రెడ్డి