తెలంగాణ

బయో టెక్నాలజీలో జాతీయంగా తెలంగాణథే అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: బయోటెక్నాలజీ, ఐటి రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందు వరసలో ఉండటంతో పాటు అంతర్జాతీయంగా అగ్రరాజ్యాల సరసన నిలుస్తోందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు పేర్కొన్నారు. గురువారం హైటెక్ సిటీలో (హెచ్‌ఐసిసి) ప్రారంభమైన 15 వ బయో ఆసియా సదస్సును ప్రారంభించారు. బయో ఆసియా సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులకు తమ (తెలంగాణ) ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. లైఫ్ సైనె్సస్‌కు హైదరాబాద్ కేంద్రబిందువుగా మారిందన్నారు. అంతర్జాతీయంగా అవసరమవుతున్న వాక్సిన్లలో 33 శాతం తెలంగాణలోనే ఉత్పత్తవుతున్నాయని, దేశంలో లైఫ్‌సైనె్సస్ ఉత్పత్తుల్లో 35 శాతం తెలంగాణలోనే కావడం గమనార్హమన్నారు. జీనోం వ్యాలీ, ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్క్ తదితరాలు అంతర్జాతీయంగా తెలంగాణకు గుర్తింపు తెచ్చాయన్నారు.