తెలంగాణ

13న ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: అంబేద్కర్ ఆదర్శం అంటూనే అయిన కోరుకున్న వర్గీకరణ చేయని భారతీయ జనతా పార్టీ తీరుకు నిరసనగా మార్చి 13న ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌కు పిలుపు నిస్తున్నట్టు ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. 24 ఏళ్లుగా వర్గీకరణ కోసం శాంతియుత పోరాటాలు చేస్తున్న ఎంఆర్‌పీఎస్ మొట్టమొదటి సారిగా నిర్వహించతలపెట్టిన 24 గంటల బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల దళితుల్లో కొన్ని కులాలు మాత్రమే లబ్దిపొందుతుండగా, జనాబా పరంగా అధికంగా ఉన్న కులాలు అన్యాయానికి గురి అవుతున్నాయని నివేదికలు వెల్లడించాయని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాలు అభివృద్థి సాధించాలంటే జనాబా పరంగా వర్గీకరణ జరగాలని అంబేద్కర్ సైతం అభిప్రాయపడ్డారని చెప్పారు. రాజ్యాంగాన్ని నిర్మించే సమయంలో రిజర్వేషన్లకు అడ్డుపడ్డ అగ్రకులాలే నేడు వర్గీకరణకు అడ్డుపడుతున్నాయని దుయ్యబట్టారు. రిజర్వేషన్లను అధికంగా ఉపయోగించుకున్న వర్గాలకు పాలకులు కీలుబొమ్మలుగా మారి ఇతర కులాలను అణిచివేస్తున్నారని అన్నారు. అంబేద్కర్ సామాజిక స్పూర్తికి, దీన్‌దయాల్ అంత్యోదయ స్పూర్తికి విరుద్దంగా బీజేపీ పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మాదిగల న్యాయమైన డిమాండ్‌ను యావత్ ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో ఒక్క రోజు బంద్ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
తాము చేయతలపెట్టిన బంద్‌కు మద్దతును ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీల నేతలను కలిసి విజ్ఞప్తి చేశామని, అందులో భాగంగా టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులను సైతం కలిసినట్టు చెప్పారు.
సీఎం అపాయింట్‌మెంట్ కోరాం...
వర్గీకరణకై ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకువెళ్లడం, పార్లమెంట్‌లో వర్గీకరణకై పట్టుబట్టడం, బంద్‌కు మద్దతును ఇవ్వాలని కోరేందుకు ముఖ్యమంత్రి అపాయింట్ కోరినట్టు మందకృష్ణ తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి విజ్ఞాపన పత్రాన్ని అందించినట్టు ఆయన చెప్పారు. తెలంగాణ పోరాట సమయంలో జరిపిన బంద్‌లకు ఎంర్‌పీఎస్ పూర్తి మద్దతునిచ్చి విజయవంతం చేసిందని అదే తరహాలో తమకు మద్దతును ఇవ్వాలని కోరనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో నయకులు లింగస్వామి, రాగాటి సత్యం, లక్ష్మణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.