తెలంగాణ

ఇంట్రా విలేజ్ పనులపై దృష్టి సారించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: మిషన్ భగీరధ ప్రధాన పనులు పూర్తి అయినందున ఇంట్రా విలేజ్ పనులపై యంత్రాంగం దృష్టి సారించాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఈఎన్‌సీ సురేందర్ రెడ్డి అన్ని జిల్లాల ఎస్‌ఈలను ఆదేశించారు. గురువారం వివిధ జిల్లాల ఎస్‌ఈలు, ఈఈలతో ఆయన విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భగీరధ పనుల పురోగతి, నాణ్యత తదితర అంశాలపై ఆరా తీశారు. పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసినందుకు అధికారులను ఆయన అభినందించారు. పల్లె ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన మహాయజ్ఞంలో ప్రతీ ఒక్కరూ పగలు, రాత్రి తేడా లేకుండా శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ప్రధాన పైప్‌లైన్ పనులు పూర్తి అయిన చోట ట్రయల్ రన్లను నిర్వహించి ఏవైనా సమస్యలు ఉంటే సరిచేయాలని సూచించారు. ట్రయల్ రన్లు విజయవంతం అయిన వెంటనే ప్రారంబోత్సవాలకు సిద్దం చేయాలన్నారు. జిల్లాల వారీగా పనుల పరిస్థితిని ఆయన సమీక్షించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో పైప్‌లైన్ పనులను చేయాలని సూచించారు. ఈ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన ఎలాంటి సహాయానైన్నా అందించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని అధికారులకు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు సహకరించేందుకు సిద్దంగా ఉన్న విషయాన్ని గుర్తించి అవసరమైన చోట వారి సహాయాన్ని తీసుకుంటూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. పనుల పురోగతిని ఫోటోలు తీసి వెబ్‌సైట్‌లో పొందుపరచాలని సూచించారు. తాగునీరు, పారిశుద్యంపై కరదీపకను ఆయన ఆవిష్కరించారు.