తెలంగాణ

ఓరుగల్లుకు మరో మణిహారం మోనోరైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్,్ఫబ్రవరి 22: ఓరుగల్లుకు మరో మణిహారం మోనోరైలు ప్రాజెక్టు కాబోతుంది. రాష్ట్రప్రభుత్వం హైద్రాబాద్ తర్వాత రెండవ మహానగరంగా వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే వరంగల్ నగరం స్మార్ట్‌సిటీలో చోటుదక్కించుకొని అభివృద్ధి పనులు జరుగుతుండగా అమృత్, హృదయ్ పథకాలు అమలుకు నోచుకున్నాయి. తాజాగా మోనోరైలు ప్రాజెక్టు వరంగల్ ట్రై సిటీకి మణిహారంగా మారనుంది. ఈ మేరకు గురువారం స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటామిన్ ట్రాన్స్‌పొర్టేషన్ వైస్ ప్రసిడెంట్ గిరాడ్డ్ స్లిండర్స్ బృందంతో పాటు గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్‌లు మోనో రైలు ప్రాజెక్టు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై గ్రేటర్ వరంగల్ పరిధిలోని కాజీపేట, హన్మకొండ, వరంగల్ పట్టణాల్లో పర్యటించారు. వరంగల్ పట్టణం మోనో రైలు ప్రాజెక్టుకు అనువుగా ఉందని స్విట్జర్లాండ్ బృందం ప్రతినిధులు వెల్లడించారు. కాజీపేట నుండి వరంగల్ వరకు 12కిలోమీటర్ల మేర నిర్మించే ఈ ప్రాజెక్టుకు రూ.1200కోట్లు అంచనా వ్యయం అవుతుందని తెలిపారు. కేవలం 18నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. డ్రైవర్ లేకుండానే ఈరైలు నడుస్తుందని వెల్లడించారు. ఇంటమిన్ ట్రాన్స్‌ఫొర్ట్, జురాచి, గ్లోబల్, స్పిండర్స్ నాలుగు కంపెనీల సహకారంతో ఈ రైలు ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందన్నారు. కాజీపేట నుండి వరంగల్‌కు ఆరు స్టేషన్లు ఉంటాయని కేవలం 18నిమిషాల్లో గమ్యం చేరుకుంటుందన్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు కోసం నేడు శుక్రవారం రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖమంత్రి కేటీఆర్‌ను కలవనున్నట్లు ఆ బృందం వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగర అభివృద్ధికోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు.
కొత్తగా ఏర్పాటు కానున్న మోనో రైలు ప్రాజెక్టుతో వరంగల్ రూపురేఖలు మారతాయని తెలిపారు. ఈప్రాజెక్టు ద్వారా వరంగల్ నగరం పర్యటకంగా బాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

చిత్రాలు..మోనో రైలు *రాంపూర్ వద్ద మోనోరైలు ప్రాజెక్టు ఏర్పాటు మ్యాపును పరిశీలిస్తున్న స్విట్జర్లాండ్ ప్రతినిధులతో
మేయర్ నన్నపునేని నరేందర్