తెలంగాణ

నాగం జనార్ధన్‌రెడ్డి మనకొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 22: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రచారం జోరందుకుంది. రాబోయే ఎన్నికల్లో నాగం జనార్థన్‌రెడ్డి కాంగ్రెస్ టిక్కెట్‌పైనే నాగర్‌కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తారనే ప్రచారం విస్తృతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి నాగం జనార్థన్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాగం జనార్థన్‌రెడ్డి మనకు వద్దంటూ ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో నాగం జనార్థన్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి రాకముందే కాంగ్రెస్ పార్టీలో ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో నాగం జనార్థన్‌రెడ్డి ముఖ్య అనుచరులు డైలామాలో పడ్డట్టు తెలుస్తుంది. నాగం జనార్థన్‌రెడ్డితో మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి చర్చించి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రాంచందర్ కుంతియాతో కూడా చర్చించినట్లు సమాచారం. నాగం జనార్థన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి జైపాల్‌రెడ్డి పెద్ద స్కెచ్ వేయడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి డికె అరుణ, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి మధ్య ఉన్నటువంటి అధిపత్యపోరు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, నాగం జనార్థన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని మాజీమంత్రి, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు నంది ఎల్లయ్యతో కలిసి ఏకంగా ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. నాగం జనార్థన్‌రెడ్డి పార్టీలోకి చేరకముందే జైపాల్‌రెడ్డి ఎత్తులను చిత్తుచేయాలని మాజీ మంత్రి డికె అరుణవర్గం సైతం స్కెచ్‌వేసి నాగంను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌లోకి రాకుండా అడ్డుకోవాలని ముమ్మర ప్రయత్నాలను మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి బహిరంగంగానే నాగంను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై నాగంతో ఆరా తీయగా తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారం అబద్ధమని కొట్టిపారేస్తున్నారు. తను ఢిల్లీకి పోయింది వాస్తవం కాదని కాంగ్రెస్ పార్టీ వారితో చర్చిం ది కూడా లేదని దాటవేస్తున్నారు. ఇది ఇలా ఉంటే టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 26వ తేదిన ప్రారంభిం చే బస్సుయాత్రలోనే నాగం చేరిక ఉండబోతుందని జైపాల్‌రెడ్డి వర్గీయులు బహిరంగంగా చెబుతున్నా రు. ప్రచారం జరుగుతుండడంతో మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి డికె అరుణల ఆధిపత్య పోరులో ఎవరిది పైచేయి ఉంటుందోనని కాంగ్రెస్ శ్రేణులు, జిల్లా ప్రజల్లో ఆసక్తి నెలకొంది.