తెలంగాణ

ఎకరా పొలం కూడా ఎండిపోనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 22: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్సారెస్పీ ఆయకట్టు ప్రాంతంలో వరి సాగు చేసిన విస్తీర్ణంలో ఎకరా పొలం కూడా ఎండిపోనివ్వమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆయకట్టు రైతాంగానికి హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ప్రకటించినట్టు రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఎవరెన్ని విమర్శలు చేసినా అన్నదాతలకు ఖరీఫ్ సీజన్‌లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని భరోసా నిచ్చా రు. ఎస్సారెస్పీ కింద పంటలకు నీళ్లు అందించేందుకు ప్రణాళిక తయారు చేయడానికి హైదరాబాద్‌లోని సచివాలయంలోని డి బ్లాక్‌లో గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్‌లు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎస్సారెస్పీ, దేవాదుల సీఇలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడుతున్న ప్రభుత్వానికి తమవంతుగా సహకరిస్తూ, మరింత అభివృద్ధికి ముందడుగేయాలని అన్నదాతలకు పిలుపునిచ్చారు. రైతాంగానికి నాణ్యమైన విద్యుత్, పొలాలకు నీళ్ళు, పండిన పంటలకు గిట్టుబాటు ధర అందించటం కోసం అనుక్షణం తమ ప్రభుత్వం ఆరాటపడుతుందని, గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నట్టు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్‌లో వేసిన పంటలు కూడా ఎండిపోకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు స్పష్టం చేశారు. దోమకాటుతో వర్షాకాలం పంటలకు తీవ్ర నష్టం జరుగగా, యాసంగిలో నీటి కోసం జిల్లా ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తుల మేరకు ముఖ్యమంత్రిని కలిసి విన్నవించినట్టు తెలిపారు. ఫలితంగా సింగూరు నుంచి ఎస్సారెస్పీకి నీళ్ళు విడుదల చేయగా, దిగువ మానేరు ఆయకట్టు పరిధిలో 4లక్షల ఎకరాలు, ఉమ్మడి జిల్లా లో మరో 2లక్షల ఎకరాల పంట కాపాడుతున్నామన్నారు. ఆయకట్టు హక్కుదారులందరికీ నీళ్ళందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం శ్రమిస్తున్నారని అన్నారు. 24గం టల విద్యుత్ సరఫరాతో కాలువలపై ఉన్న మోటార్లతో నీటిని తోడేస్తుండగా, ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో 9గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్సారెస్పీలో 27టీఎంసీల నీళ్ళుండగా, ఎల్‌ఎండిలో10టీఎంసీల నీళ్ళున్నాయని, ఎల్‌ఎండి దిగువ ప్రాంతానికి 4వ తడికి 7రోజులు, 5,6 తడులకు 6రోజులు, ఎగువ భాగానికి 5,6 తడులకు ఏడు రోజులు, 7,8 తడులకు ఒక్కొ దానికి ఆరు రోజుల పాటు నీళ్ళు ఇచ్చేందుకు చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తాగునీటి కన్నా సాగునీటికే రైతులు అధిక ప్రాధాన్యతనిస్తారని, వారి ఆలోచనలకనుగుణంగా ప్రభు త్వం, అధికారులు సంయుక్తంగా నిత్యం సమావేశాలు ఏర్పాటు చేస్తూ సమీక్షిస్తున్నట్టు తెలిపారు. పంటలెండి పోకూడదని అధికారులతో కలిసి కష్టపడుతుంటే, కొంతమంది ప్రతిపక్ష నేతలు పొలాలు ఎండిపోవాలి, దానిపై రాజకీయం చేయాలని నీచంగా ఆలోచిస్తున్నారని ఆరోపించారు. ధర్నాలు, రాస్తారోకోలంటూ రైతుల కళ్ళలో మట్టికొట్టే యత్నం చేస్తుంటే, ప్రభుత్వం రైతులకు సకాలంలో సాగు నీరందించి ఆదుకుంటుందన్నారు. ఈ సమీక్షలో సాగునీటి శాఖ అధికారులతో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, కె.విద్యాసాగర్‌రావు, పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..అధికారులు, ఎమ్మెల్యేలతో సమీక్షిస్తున్న మంత్రి రాజేందర్