తెలంగాణ

ఫార్మా అభివృద్ధితో పాటు ప్రజారోగ్యం ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: దేశంలో ఫార్మా రంగం అభివృద్థితో పాటు ప్రజా ఆరోగ్యం ఎంతో ముఖ్యమని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు అన్నారు. బయో ఆసియా సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సురేష్ ప్రభు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్, సురేష్ ప్రభుల మధ్య ఫార్మా రంగంపై చర్చ జరిగింది. హైదరాబాద్ నగరం వ్యాక్సిన్ రాజధానిగా అవతరించిందని కేటీఆర్ పేర్కొన్నారు. అనంతరం దేశంలో ఫార్మా రంగం అభివృద్థికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ఎలాంటి భరోసా ఇస్తున్నారు, ఔషధాల ధరల విషయంలో తీసుకుంటున్న చర్యలను వివరించాలని కోరారు. దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా ఫార్మా రంగ అభివృద్థికై నిర్ణయాలు తీసుకుంటున్నామని సురేష్ ప్రభు వివరించారు. పేదల ఆరోగ్య సంరక్షణలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.

చిత్రం..బయో ఆసియా సదస్సు ముగింపు కార్యక్రమంలో భాగంగా ఫార్మా రంగంపై జరిగిన చర్చలో పాల్గొన్న కేంద్ర మంత్రి సురేష్‌ప్రభు, తెలంగాణ మంత్రి కేటీఆర్