తెలంగాణ

తెలంగాణ పోలీస్‌కు మరో ప్రతిష్టాత్మక అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: తెలంగాణ పోలీస్ శాఖ మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది. పోలీసింగ్‌లో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీని విస్తత్రంగా వినియోగించి శాఖ పనితీరు ఎంతో మెరుగుపర్చినందుకు గాను ఈ అవార్డు లభించింది. గత ఏడాది టిఎస్ కాప్ మొబైల్ అప్లికేషన్స్ ఆవిష్కరించి తద్వారా రియల్ టైం పోలీసింగ్ ప్రాజెక్టును దిగ్విజయంగా అమలు చేసినందుకు గాను నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ఆ ప్రాజెక్టును ‘2017 ఉత్తమ ఐటి ప్రాజెక్టు’గా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎన్‌సిఆర్‌బి జాయింట్ డైరక్టర్ సంజయ్ మాథుర్ తెలంగాణ డిజిపి ఎం.మహేందర్‌రెడ్డికి లేఖ రాశారు. ఈ అవార్డును చెన్నైలో ఈ నెల 28న నిర్వహించే ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్ (ఎఐపిడిఎం) ముగింపు సమావేశంలో ఎన్‌సిఆర్‌బి ట్రోపీని ప్రదానం చేస్తారని సమాచారం అందించారు. ఈ లేఖపై డిజిపి మహేందర్ రెడ్డి స్పందిస్తూ తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తున్న ప్రతి ఒక్కరి విజయంగా అభివర్ణించారు. ఐటి అప్లికేషన్స్ వినియోగించి పోలీసు శాఖ సేవలను మరింత అందుబాటులోకి తేవడం ద్వారా ఇటు అధికారులకు తక్షణమే సమాచారం చేతిలో ఉండడం, అటు నేరగాళ్ల కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు దోహదపడిందని అన్నారు. మొబైల్ అప్లికేషన్స్ ఆధారితంగా పని చేసే టిఎస్‌కాప్ తొలుత హైదరాబాద్ నగరంలో చేపట్టి విజయవంతం కావడంతో ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. సిసిటిఎన్‌ఎస్ ప్రాజెక్టు ద్వారా డేటా విశే్లషించుకోవడం సులభమైందని తెలిపారు. టిఎస్ కాప్ మొబైల్ అప్లికేషన్స్‌ను ఆవిష్కరించడంతో మొత్తం పోలీస్ శాఖ పని తీరే మారిపోయిందని, ఇది కొత్త సాంకేతిక విప్లవానికి నాందిపలికిందని వెల్లడించారు. భవిష్యత్‌లో టిఎస్ కాప్‌కు మరిన్ని ఆవిష్కరణలు జోడించడం ద్వారా నిరంతరం కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ కొనసాగుతుందని డిజిపి వెల్లడించారు. ఈ అవార్డు కోసం ఏడు రాష్ట్రాలు పోటీపడి నామినేషన్లు పంపించాయి. ఆంధ్రప్రదేశ్, చంఢీఘడ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు పోటీపడగా, తెలంగాణ పోలీస్ శాఖ ప్రధమ స్ధానంలో నిలిచి ఎన్‌సిఆర్‌బి ట్రోపిని సొంతం చేసుకుంది.