తెలంగాణ

రేపటినుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: ఈ నెల 26న చేవెళ్ళ నుంచి కాంగ్రెస్ చేపట్టనున్న ప్రజా చైతన్య బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాలుగు కమిటీలను నియమించారు. కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ నేతృత్వంలో ఆర్గనైజింగ్ కమిటీని నియమించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అధ్వర్యంలో సలహా సంఘాన్ని, పార్టీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి అధ్వర్యంలో 9 మందితో ఆర్థిక కమిటీని, మాజీ ఎంపి మల్లు రవి అధ్వర్యంలో మీడియా కమిటీని నియమించారు. భట్టి నేతృత్వంలో 18 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీలో ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి వి. హనుమంత రావు, ఇతర నాయకులు పొన్నాల లక్ష్మయ్య, నంది ఎల్లయ్య, సర్వే సత్యనారాయణ, గీతారెడ్డి, డికె అరుణ, సబితా ఇంద్రారెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీ్ధర్ బాబు, అంజన్‌కుమార్ యాదవ్, గండ్ర వెంకటరమణా రెడ్డి, ఎం. కోదండరెడ్డి తదితరులను నియమించారు. ప్రజా చైతన్య యాత్రకు 40 సీట్ల వోల్పో బస్సు సిద్ధమైంది. బస్సుపై కాంగ్రెస్ పార్టీ జెండా గుర్తును పెట్టారు. ఇంకా ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా, ఉత్తమ్‌కుమార్ రెడ్డిల ఫొటోలను అతికించారు. యాత్రలో పాల్గొనాల్సిందిగా ఉత్తమ్ పార్టీ ముఖ్యులతో మాట్లాడుతున్నారు.
సోమవారం ఉదయం 10 గంటలకు ముందుగా నాంపల్లి దర్గాలో ప్రార్థనలు నిర్వహించి అక్కడి నుంచి రథయాత్రలో పాల్గొనే నేతలంతా బయలుదేరి, 11 గంటలకు గండిపేట రోడ్డులోని ఆరె మైసమ్మ తల్లిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. 12 గంటలకు మొయినాబాద్ వద్ద చర్చీలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒంటి గంట వరకు చేవెళ్ళకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో కుంతియా, ఉత్తమ్ ప్రభృతులు ప్రసంగిస్తారు. అక్కడి నుంచి బస్సు యాత్ర ప్రారంభమై 4 గంటలకు వికారాబాద్‌కు చేరుకుంటుంది.
వికారాబాద్‌లో బహిరంగ సభ అనంతరం రాత్రి అక్కడే బస చేస్తారు. మర్నాడు ఉదయం బయలుదేరి తాండూరుకు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ ముగిసాక, సాయంత్రం 4 గంటలకు సంగారెడ్డి చేరుకుంటారు. సంగారెడ్డిలో రాత్రి బస చేసి 28న మధ్యాహ్నం జహీరాబాద్‌లో, సాయంత్రం 4 గంటలకు నారాయణఖేడ్‌లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ప్రధానంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ నాలుగేళ్ళలో అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి, నిరంకుశత్వం, కుటుంబ పాలన, అప్పులు, అణచి వేత, మానవ హక్కుల ఉల్లంఘన, దళిత, గిరిజన, బిసి మైనారిటీ ప్రజలపై దాడులు తదితర అంశాలపై ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని భావిస్తున్నారు. ఇలాఉండగా శనివారం ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫేస్ బుక్ ద్వారా పార్టీ కార్యకర్తలతో రెండున్నర గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు.

చిత్రం..కాంగ్రెస్ ప్రజాచైతన్య యాత్రకు సిద్ధమైన బస్సు