తెలంగాణ

సజావుగా టీఆర్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆధ్వర్యంలో ఎంపిక పరీక్షలు శనివారం నాడు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. అందరికీ సకాలంలో హాల్‌టిక్కెట్లు అందాయని, 92 శాతం మంది పరీక్ష రాశారని కమిషన్ చైర్మన్ డాక్టర్ ఘంటా చక్రపాణి పాత్రికేయులకు చెప్పారు. మార్చి 4వ తేదీ వరకూ పలు పోస్టులకు, వేర్వేరు మాధ్యమాల్లో మొత్తం 42 ఎంపిక పరీక్షలు జరుగుతాయని అన్నారు. కొన్ని పోస్టులకు తెలుగు, ఇంగ్లీషు మాద్యమాల్లోనూ, మరికొన్ని పోస్టులకు హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా జరుగుతున్నాయని ఇదంతా అతి పెద్ద ప్రక్రియ అని అన్నారు. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేస్తూ అపోహలు లేవనెత్తిన వారిపై తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సర్వీసు కమిషన్‌కు చెడ్డ పేరు తెస్తే సహించేది లేదని అన్నారు. 25వ తేదీన జరిగే పరీక్షకు దాదాపు 50వేల మంది హాజరుకానున్నారని అన్నారు. రాష్ట్రంలో 8792 టీచర్ పోస్టులకు ఈ ఎంపిక పరీక్షలు జరుగుతున్నాయి, ఇందులో 5415 ఎస్‌జిటి పోస్టులు, 1941 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1011 లాంగ్వేజి పండిట్ పోస్టులు, 416 పిఇటి, 9 స్కూల్ అసిస్టెంట్ (్ఫజికల్ ఎడ్యుకేషన్) పోస్టులున్నాయి. కొన్ని సిబిఆర్‌టి పద్ధతిలో కొన్ని ఒఎంఆర్ పద్ధతిలో జరుగుతున్నాయని, అభ్యర్ధులు తమ పరీక్ష రోజున, కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని ఆయన సూచించారు. బోర్డు కార్యదర్శి వాణి ప్రసాద్‌తో కలిసి ఆయన శనివారం నాడు పాత్రికేయులతో మాట్లాడారు. 25న ఉదయం ఒఎంఆర్ పద్ధతిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు, సాయంత్రం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషుకు ఎంపిక పరీక్షలు జరుగుతాయి. 26న స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, సాయంత్రం స్కూల్ అసిస్టెంట్ మాథ్స్, ఎస్‌ఎస్ ఇంగ్లీషు మీడియం పోస్టులకు ఎంపిక పరీక్ష జరుగుతుంది. 27న స్కూల్ అసిస్టెంట్ పిఎస్ (తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, తమిళ మాధ్యమాలు) పోస్టులకు, 27 సాయంత్రం లాంగ్వేజి పండిట్‌లు ఉర్దూ, మరాఠీ, హిందీ పోస్టులకు పరీక్ష జరుగుతుంది. 28న పిఇటికి సిబిఆర్‌టి పద్ధతిలో, 28 సాయంత్రం స్కూల్ అసిస్టెంట్ హిందీ , కన్నడం, తమిళం, ఉర్దూ పోస్టులకు, మార్చి 2న ఎస్‌జిటి (బెంగాలీ, హిందీ, కన్నడం, మరాఠీ, ఉర్దూ, తమిళం పోస్టులకు), 2వ తేదీ సాయంత్రం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కు, 3వ తేదీన స్కూల్ అసిస్టెంట్ బయో, మాథ్స్ పోస్టులకు, 34వ తేదీ సాయంత్రం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీషు మీడియం పోస్టులకు ఎంపిక పరీక్ష జరుగుతుంది. ఇక నాలుగో తేదీన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, మాథ్స్, ఎస్‌ఎస్ తెలుగు మీడియం పోస్టులకు, అదే రోజు సాయంత్రం పిఇటి ఇంగ్లీషు మీడియం పోస్టులకు పరీక్ష జరుగుతుంది.

చిత్రం..నాగోల్‌లోని ఓ కేంద్రం వద్ద పరీక్షకు హాజరవుతున్న టీఆర్టీ అభ్యర్థులు