తెలంగాణ

కేసీఆరే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదర్శ రైతుగా నిలుస్తున్నారు. సిద్ధిపేట జిల్లా మర్కూరు మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో ఆయనకు 70 ఎకరాల వ్యవసాయ భూమి (్ఫంహౌస్) ఉంది. ఈ భూమిపై కురిసే ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టేందుకు దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో భారీ బావి తవ్వారు. పొలంలో కురిసే వర్షపునీరు ఈ బావిలోకి చేరేందుకు కాలువలు తవ్వారు. మొత్తం వ్యవసాయ క్షేత్రంలో వేసే పంటలకు ఈ బావి నీరే ప్రధాన ఆధారంగా ఉంది. ఈ బావికి నాలుగైదు మోటార్లు బిగించి ఫాంహౌస్‌లోని పంటలకు నీటిని డ్రిప్ విధానంలో ఇస్తున్నారు. ఫాంహౌస్‌లో బావితోపాటు కొన్ని బోర్‌వెల్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫాంహౌస్‌లో పుచ్చకాయ, కర్బూజా పళ్లతోటలను వేశారు. మంచి దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ఇంతకు ముందు అల్లం పంట వేశారు. 40 ఎకరాల్లో ఇటీవలనే బొప్పాయి వేసి దాదాపు రెండుకోట్ల రూపాయల విలువైన పంట తీశారు. ఫాంహౌస్‌లోనే ఒక భాగంలో ఐదెకరాల్లో పాలిహౌస్ విధానంలో సేద్యం చేస్తున్నారు. పాలిహౌస్‌లో ప్రస్తుతం కీరాలో ఒక రకమైన యూరోపియన్ కుకుంబర్ వేశారు. 45 రోజుల నుండి పంట రావడం ప్రారంభమై నాలుగు నెలల వరకు పంట రెగ్యులర్‌గా వస్తోంది. ఇంతకు ముందు పాలిహౌస్‌లోనే ఎరుపు, పసుపు రంగుల్లో క్యాప్సికం, ఫ్రెంచ్‌బీన్స్ పంటలను వేసి మంచి ఉత్పత్తి తీశారు. క్యాప్సికం వేయగా ఎకరాకు సుమారు మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టగా, ఎకరాపై దాదాపు 20 లక్షల వరకు ధర లభించింది.
కెసిఆర్‌కు సంబంధించిన ఫాంహౌస్ నిర్వహణను ఆయన మిత్రుడు ఎండి జహంగీర్ చూస్తున్నారు. ఫాంహౌస్‌కు కెసిఆర్ రెగ్యులర్‌గా వస్తారని, పంటలను స్వయంగా పరిశీలిస్తారని జహంగీర్ ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు. పంటల కోసం యంత్రాలను ప్రధానంగా వాడుతున్నామన్నారు. మార్కెట్‌లో పంటల సరళిని పరిశీలించి పంటలను వేస్తుంటామని, స్టార్ హోటళ్లు, మాల్స్‌కు వీటిని సరఫరా చేస్తామని, ఢిల్లీ తదితర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తామన్నారు. స్థానికంగా కూడా కొంత పంట విక్రయిస్తుంటామని జహంగీర్ తెలిపారు.

చిత్రం..కేసీఆర్ ఫాంహౌస్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న జహంగీర్