తెలంగాణ

కలిసి సాగేనా.. సీట్లు గెలిచేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 24:నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ రాజకీయాలపై పూర్తి పట్టుకు ఉమ్మడి జిల్లా నుండి రాష్ట్ర కేబినెట్‌లో ఏకైక మంత్రిగా ఉన్న జి.జగదీష్‌రెడ్డి ఆది నుండి చేస్తున్న ప్రయత్నాలకు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రాబల్యం సవాల్‌గా మారుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యాఘటనలో కాంగ్రెస్ రాజకీయ దాడిని తిప్పికొట్టడంతో మంత్రి జగదీష్‌రెడ్డి వర్గం విఫలమైనట్లుగా భావిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ ఎంపీ గుత్తా వైపు దృష్టి సారించినట్లుగా గులాబీ వర్గాల్లో సాగుతున్న ప్రచారం రాజకీయ వర్గా ల్లో ఆసక్తి రేపుతోంది. నల్లగొండ జిల్లా రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన ఎంపీ గుత్తా పార్టీ విస్తరణలో క్రియాశీలకంగా వ్యవహరించాలంటు సీఎం కేసీఆర్ సూచించినట్లుగా టీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపీ గుత్తాను త్వరలో నియమించనున్నారు. దీనితో పాటు జిల్లాలో పార్టీ అభివృద్ధి, ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు బాధ్యతల్లో గుత్తాకు మరింత స్వేచ్ఛనివ్వాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది.తాజా ప్రచారంతో నిన్నమొన్నటిదాకా ఇప్పు డో ఎప్పుడో అన్నట్లుగా జిల్లా కేంద్రా నికి వస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో తన రాజకీయ పట్టును కోల్పోకుండా ఉండేందుకు ఇకముందు జిల్లా కేంద్రంతో పాటు నూతన నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విస్తృత పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతుండటం ఆసక్తి రేపుతోంది.
పట్టు చేజారకుండా పాట్లు...
జిల్లాలో ఎంపీ గుత్తా, జగదీష్‌రెడ్డిలు కలిసి పలు కార్యక్రమాల్లో కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం ఎవరికి వారు సీఎం కేసీఆర్ వద్ద తమ ప్రాబల్యం పెంచుకోవడంలో పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుండి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎంపీ గుత్తాకు సీఎం కేసీఆర్‌తో గతంలో టీడీపీ నుంచి మంచి అనుబంధం ఉంది. అటు జగదీష్‌రెడ్డి సైతం సీఎం కేసీఆర్‌కు కుడిభజంగా ఉద్యమకాలం నుండి కొనసాగుతున్నారు.