తెలంగాణ

జిల్లా కేంద్రాల్లో మినీ ట్యాంక్‌బండ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 24: రాష్ట్రంలోని అన్నీ జిల్లా కేంద్రాల్లో ఉన్న పెద్ద చెరువులను మినీ టాంక్‌బండ్‌లుగా నిర్మించి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా తీర్చిదిద్దుతామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్లడించారు.
జిల్లాలోని ప్రాజెక్టులకు సంబందించిన భూసేకరణపై స్థానిక కలెక్టరేట్‌లో అధికారులతో శుక్రవారం రాత్రి పొద్దుపోయేదాక సమీక్షించిన అనంతరం ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి స్వగృహంలో బసచేసిన అనంతరం శనివారం ఉదయం పట్టణంలోని కేసరి సముద్రం చెరువు కట్టపై మార్నింగ్ వాక్ చేస్తూ మినీ టాంక్‌బండ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
అనంతరం విలేఖరులతో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ పట్టణీకరణ పెరుగుతున్న ఈ రోజులలో పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు పట్టణాలలో ఉన్న పెద్ద చెరువులను మినీ ట్యాంక్ బండ్‌లుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలోను, నియోజక వర్గాల కేంద్రాలలోను మినీ ట్యాంక్ బండ్‌ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. పచ్చని వాతావరణంతో పాటు మార్నింగ్ వాక్ చేసేందుకు అవసరమైన సదుపాయాలు, పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని, వ్యాయామ శాలతో పాటు స్విమ్మింగ్ ఫూల్‌తో పాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్ చెరువు వైశాల్యం ఎక్కువగా ఉన్నందున ఎఫ్‌టీ ఎల్ నిర్ధారించి చుట్టూ రోడ్డు నిర్మాణం చేపట్టి సైక్లింగ్ చేసే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి సొంత నిధులతో బుద్ధ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. పట్టణం సమీపంలో ఉన్నందున మురుగునీరు చెరువులోకి రాకుం డా ప్రత్యేకంగా కాలువ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశారని తెలిపారు. నాగర్‌కర్నూ ల్ మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం కోసం రూ. 12కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. కట్టపైన సీసీ రోడ్డు వేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు.

చిత్రం..నాగర్‌కర్నూల్‌లోని కేసరి సముద్రం చెరువు కట్టపై ఎమ్మెల్యేలు, కలెక్టర్‌తో కలిసి
మార్నింగ్ వాక్ చేస్తున్న మంత్రి హరీష్‌రావు