తెలంగాణ

కలెక్టర్, పోలీసు కమిషనర్ గైర్హాజరుపై ఎస్సీ కమిషన్ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఫిబ్రవరి 24 : జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు అధికారికంగా నిర్వహించే సమీక్ష సమావేశానికి జిల్లా పాలనాధికారి కలెక్టర్, పోలీసు కమిషనర్లు గైర్హాజరు పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యుడిషియల్ అధికారులు ఉన్న ఎస్సీ,ఎస్టీ కమిషన్ అధికారికంగా పర్యటనకు వస్తే జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, పోలీసు కమిషనర్ గైర్హాజరై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సామాన్య ప్రజల పట్ల ఏవిధంగా వ్యవహరిస్తారో స్పష్టమవుతుందన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ అధికారిక పర్యటన జిల్లాలో వివిధ సమస్యలపై సమీక్ష నిర్వహించినప్పుడు 34 శాఖల అధికారులు హాజరు కావాల్సి వుంటుందని, ముఖ్యంగా రెవెన్యూ, శాంతిభద్రతల సమస్యలే అతి ముఖ్యమైనవన్నారు. కలెక్టర్, పోలీసు కమిషనర్లు హాజరుకాకుండ సమస్యలపై ఏలా సమీక్ష నిర్వహించాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం సిద్దిపేట జిల్లా రైస్‌మిల్లర్స్ సమావేశ మందిరంలో అధికారులు, దళిత సంఘాలతోనిర్వహించిన సమీక్ష సమావేశానికి ఎస్సీ,ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యుడు రాములు ముఖ్య అతిథిగా హజరైనారు. జిల్లాలోని వివిధ దళిత సంఘాలు పలు సమస్యలపై ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. దళితులు తమ సమస్యలను విన్నవించటంపై సానుకూలంగా స్పందించారు. ఈసందర్భంగా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాములు మాట్లాడుతూ పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, ఇన్‌చార్జి కమిషనర్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి గైర్హాజరు కావటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశా రు. జిల్లాలో ఎంత మంది ఆర్డీఓలు ఉన్నారు, ఎంత మంది హాజరైనారని ప్రశ్నించగా ముగ్గురు ఆర్డీఓలకు ఏ ఒక్క ఆర్డీఓ హజరు కాకపోవటం, మండల తహశీల్దార్లు సైతం హాజరు కాకపోవటంపై ఆ సహనం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎంత మంది ఏసీపీలు, డీసీపీలు ఉన్నారని, ఎంత మంది హాజరైనారని ప్రశ్నించారు.
ఇద్దరు డీసీపీలకు ఒక్క డీసీపీ, ముగ్గురు ఎసీపీలకు ఒక్క ఎసీపీ మాత్రమే హాజరైనారు. అలా గే సీవిల్ సప్లయ్ అధికారి, వైద్యాధికారులు హాజరైనారని ప్రశ్నించగా హాజరు కాకపోవటం పట్ల తీవ్ర అ సంతృప్తి వ్యక్తం చేశారు.

చిత్రం..సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న రాములు