తెలంగాణ

నాలుగు వేల సాయం వదులుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చే పంటల పెట్టుబడి సాయాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటున్నానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన రైతుసమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహనా సదస్సు ఆదివారం ఇక్కడ జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను కూడా రైతునేనని, ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి సాయం తనకు కూడా వర్తిస్తుందని గుర్తు చేశారు. సిద్ధిపేట జిల్లాలో తాను సేద్యం చేస్తున్నానని, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఎకరానికి ఒక పంటకు నాలుగు వేల రూపాయల సాయం తనకు కూడా వర్తిస్తుందన్నారు.
అయితే రైతుల సంక్షేమం కోసం ఉద్దేశంచి, తన భూముల్లో సేద్యానికి తన సొంత డబ్బునే వినియోగిస్తానని చెప్పారు. ప్రభుత్వం ఒక సారి రైతుల పేరుతో విడుదల చేసే డబ్బు రాష్ట్ర ఖజానాకు వాపస్ వెళ్లదని, అయితే ఎవరైనా స్వచ్ఛందం గా ఈ డబ్బు వద్దనుకుంటే ఈ డబ్బు రాష్ట్ర రైతు సమన్వయ సమితి పద్దుల్లోకి చేరుతుందని చెప్పారు. ఈ డబ్బును వదులు కోవడంతో రాష్ట్రంలోని పెద్ద రైతులందరికీ ఆదర్శంగా నిలిచినట్టయింది.