తెలంగాణ

మార్చి మొదటి వారంలో రాజ్యసభ అభ్యర్థుల పేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో టిఆర్‌ఎస్ తరఫున మూడు సీట్లకు అభ్యర్థుల ఖరారుపై సర్వత్రా ఉత్కం ఠ నెలకొంది. మార్చి 12వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముగ్గురు అభ్యర్థులను నామినేషన్ల తేదీ కంటే ముందు రోజే ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి మూడు సీట్లు కూడా టిఆర్‌ఎస్ పార్టీనే గెలుచుకోవడం ఖాయం. శాసనసభలో టిఆర్‌ఎస్ తరఫున వివిధ పార్టీల నుంచి చేరిన ఎమ్మెల్యేలతో కలిపి 90 మంది సభ్యులు ఉన్నారు. టిఆర్‌ఎస్‌కు ఎఐఎంఐఎం పార్టీ మద్దతు లభించనుంది. ఈ పార్టీకి అసెంబ్లీలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 13 మంది, టిడిపికి ఇద్దరు, బిజెపికి ఐదుగురు, సిపిఎంకు ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం టిఆర్‌ఎస్‌కు లోక్‌సభలో 11 మంది ఎంపీలు, రాజ్యసభలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో టిఆర్‌ఎస్ నుంచి ఎన్నికైన పిసిసి మాజీ అధ్యక్షులు కె కేశవరావు, డి శ్రీనివాస్ ఇద్దరూ బిసి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. తాజా ఎన్నికతో రాజ్యసభలో టిఆర్‌ఎస్ బలం ఐదుకు చేరుకుంటుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే ఒక సీటును యాదవులకు ఇస్తామని ప్రకటించారు. మిగిలిన రెండు సీట్లలో ఒక సీటు అగ్రకులాలవారికి, ఒక సీటును ఎస్సీ లేదా మైనార్టీలకు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. మూడో సీటుకు అభ్యర్థికి ఖరారు చేసే ముందు మజ్లిస్ పార్టీ అధినేతలతో కెసిఆర్ మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఏప్రిల్ 2వ తేదీతో ముగ్గురు రాజ్యసభ సభ్యు ల పదవీకాలం ముగుస్తుంది. టిడిపికి చెంది న సిఎం రమేష్, రాపోలు ఆనంద భాస్కర్, పదవీ కాలం ముగియనుంది. కాగా పాల్వా యి గోవర్ధన్ రెడ్డి గత ఏడాది జూన్‌లో మరణించారు. అప్పటి నుంచి ఆ సీటు ఖాళీగా ఉంది.