తెలంగాణ

విపక్షాలది ‘బట్టేబాజ్ రాజకీయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో విపక్షాలు ‘బట్టేబాజ్ రాజకీయం’ చేస్తున్నాయని ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు దాదాపు 200 కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో వేశారని తెలిపారు. అలాగే ఇతర నీటిపారుదల ప్రాజెక్టులను కూడా అడ్డుకునేందుకు కేసులు నమోదు చేస్తున్నారన్నారు. తెలంగాణలో రైతుల దుఃఖాన్ని పోగొట్టేందుకు తాను ప్రయత్నిస్తుంటే విపక్షాలు చిల్లరగా వ్యవహరిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో టిడిపి నేతలు, టిడిపి అధికారంలో ఉన్న సమయం లో కాంగ్రెస్ నేతలు చట్టసభల్లో కందీళ్లు, ఎక్కాలు పట్టుని కరెంట్ లేదంటూ హేళన చేసే విధంగా ప్రవర్తించేవారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం నేడు వ్యవసాయానికి 24 గంటల పాటు కరెంట్ ఇస్తోందని, గృహావసరాలుకు కోత లేకుండా కరెంట్ ఇస్తున్నట్టు తెలిపారు. పరిశ్రమలకు కూడా కోత లేకుండా కరెంట్ ఇస్తున్నామన్నారు. రైతు సమన్వయ సమితుల వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతాయని విపక్షాలు ‘సన్నాసి’ వాదనలు చేస్తున్నారని కెసిఆర్ ఆగ్రసం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల బాధ్యతలు వాటికి ఉన్నాయన్నారు. పంటల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ఇవ్వడానికి తమ ప్రభుత్వం అవసరమైన చర్యలు వేగంగా తీసుకుంటోందన్నారు. ఎక్కడో ఒక చోట రైతులకు సమస్యలు ఎదురైతే విపక్షాలు రంగంలోకి దిగి ధర్నాలు, హర్తాల్ చేస్తూ, విధ్వంసానికి పూనుకుంటున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించేలే తప్ప ధర్నాల వల్ల ఉపయోగం ఉండదన్నారు. ఈ తరహా రాజకీయాలు చేయడం మంచిది కాదని కెసిఆర్ హితవు చెప్పారు.

చిత్రం..రైతు సమన్వయ సమితుల సభలో కేసీఆర్‌కు జ్ఞాపికను బహుకరిస్తున్న దృశ్యం