తెలంగాణ

భవిష్యత్ తరాల కోసం ఆలోచించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 25: ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. దీనిపై ఇప్పటికే ప్రధానికి లేఖలు రాసి విన్నవించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆదివారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన దక్షిణ తెలంగాణ రైతు సమన్వయ సమితుల సదస్సుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి కే.హరీష్‌రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం రైతులు అడిగిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీ ఆర్, మంత్రి హరీష్‌రావులు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీ ఆర్ మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని సదస్సులో తీర్మానం చేస్తున్నట్లు ప్రకటించారు. అటవీశాఖ సహకారంతో కోతులు, అడవి పందుల బెడద తగ్గిస్తామని వివరించారు. సబ్సీడీపై సోలార్ ఫెన్సింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్ తరాల కోసం మనం ఆలోచించాలని ఆయన అభిప్రాయపడ్డారు. హరితహారంలో భాగంగా వైల్డ్‌ఫ్రూట్స్ చెట్లను పెంచుతున్నామని, రైతులకు ఎలాంటి సమస్య ఉన్నా రైతు సమన్వయ సమితికి తెలియజేయాలని తెలిపారు. మార్కెట్‌కు తెచ్చే ధాన్యంలో తేమశాతం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులంతా ఐక్యంగా ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్నారు. పంటను ఒకేసారి మార్కెట్‌కు తరలించకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామ రైతులకు ఒక నిర్ణీత రోజు, సమయం కేటాయించాలని, వచ్చే వర్షాకాలపు పంట ఒక్క గింజ కూడా కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్మనివొద్దన్నారు. గిట్టుబాటు ధర రావాలంటే అది రైతుల చేతుల్లో ఉందని, నిమిషాల మీద కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. చెక్కుల పంపిణీలో క్రమశిక్షణ పాటించిన గ్రామాల రైతులను ఇజ్రాయెల్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. స్థానికంగా ఎక్కడ ఏ పంటలు పండుతాయో అక్కడ వాటికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు 75 శాతం సబ్సిడీతో టార్పాలిన్లనను ఇస్తామన్నారు. తెలంగాణ రైతులను దేశంలోనే అత్యుత్తమ రైతులుగా తీర్చిదిద్దుతామన్నారు. సమితుల కోసం ఎకరం స్థలం, నగదును విరాళంగా ఇచ్చిన రైతులను వేదికపై సీ ఎం కేసీ ఆర్ సన్మానించారు.
ప్రతి మండలలో గోదాం : హరీష్‌రావు
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏడాదిలో గోదాముల సామర్థ్యం పెంచామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్లడించారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ రూ.వెయ్యి కోట్లతో గోదాంలు నిర్మించామని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాంలు ఉండేవని, ఇప్పుడు వాటి సామర్థ్యం 18 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో ఒక గోదాం నిర్మించామన్నారు. కొన్ని చోట్ల పట్టణానికి మధ్యలో కొన్ని గోదాంలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం స్థలం చూపిస్తే వాటి స్థానంలో మరింత విశాలంగా కొత్త వసతులతో కొత్త సాంకేతికతతో నూతన గోదాంలను నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. మహబూబ్‌నగర్‌లో పత్తిపంట ఎక్కువ పండుతుంది కాని జిన్నింగ్ మిల్లలు తక్కువగా ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గోదాంలు నిర్మించారన్నారు. అయితే టీ ఆర్ ఎస్ పాలనలో ఒక్క సంవత్సరంలోనే రూ.వెయ్యి కోట్లతో 18 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలు నిర్మించామని తెలిపారు. రైతు సమన్వయ సమితి సూచనల మేరకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పుతామని వెల్లడించారు. ప్రాసెసింగ్ ప్లాంట్లు పెరిగితే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. నూతనంగా 35 మార్కెట్ యార్డులను ఏర్పాటు చేశామన్నారు.

చిత్రం..దక్షిణ తెలంగాణ రైతు సమన్వయ సమితుల సదస్సు మాట్లాడుతూన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు