తెలంగాణ

వర్గీకరణ సాధనలో చావోరేవో తేల్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట టౌన్, ఫిబ్రవరి 25: అధికారంలోకి రాగానే వంద రోజుల్లో వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పిన బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతున్నా పట్టించుకోకపోవడం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీలు సైతం మాదిగ జాతితో చెలగాటం ఆడుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నా రు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని ప్రెస్‌క్లబ్ భవన్ లో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ విషయంలో అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మార్చి 13న తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జాతి కోసం మొదటిసారిగా పిలుపునిస్తున్న బంద్‌లో మాదిగ, మాదిగ ఉపకులాల బిడ్డలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ సాధన ఉద్యమంలో చావోరేవో తెల్చుకోవాల్సిన బాధ్యత మాదిగ, మాదిగ ఉపకులాల బిడ్డలపై ఉందన్నారు. ఎబీసీడీ వర్గీకరణ జరిగితే మాదిగ, మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ నాయకులు వర్గీకరణకు మద్దతునిచ్చి ఆధికారంలోకి రాగానే మరిచిపోవడం సిగ్గుచేటన్నారు. 15శాతం రిజర్వేషన్లు అనుభవించాల్సిన మాదిగ, మాదిగ ఉపకులాలు కేవలం 3శాతం మాత్రమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారన్నారు. వర్గీకరణ సాధిస్తే 11శాతం రిజర్వేషన్లు వచ్చి తీరుతాయన్నారు. 6శాతం రిజర్వేషన్లు పొందాల్సిన వారు 12శాతం రిజర్వేషన్లు పొందుతున్నారని వివరించారు. వర్గీకరణ కోసం తాను కలువని నేతలు లేరన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే అఖిలపక్షాన్ని డిల్లీ తీసుకెళ్లి వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు జంగయ్య, రోమాల బాబు, యాదగిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.